కోతుల దెబ్బ.. గ్యాస్ లీక్
Monkeys break PNG line in Kanpur. కోతులు చేసే పనులకు ఒక్కోసారి ఏమి జరుగుతోందా అనే భయం తప్పకుండా ఉంటుంది.
By M.S.R
కోతులు చేసే పనులకు ఒక్కోసారి ఏమి జరుగుతోందా అనే భయం తప్పకుండా ఉంటుంది. ముఖ్యంగా కోతులను కంట్రోల్ చేయడం కూడా చాలా కష్టమే..! కోతులు చేసిన చేష్టలతో కాన్పూర్ వాసుల్లో ఒకటే టెన్షన్ మొదలైంది. ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. యూపీలోని కాన్పూర్‌లో సహజవాయువు (పీఎన్‌జీ) పైప్‌లైన్‌ను కోతుల గుంపు పగలగొట్టడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కిద్వాయ్ నగర్ వై బ్లాక్‌లోని చాముండా పార్కు సమీపంలో ఆదివారం అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. గ్యాస్ లీకేజీకి భయపడి స్థానికులు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. వెంటనే, సెంట్రల్ యుపి గ్యాస్ లిమిటెడ్ (సియుజిఎల్) బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది.. అరగంట ప్రయత్నం తర్వాత పైప్‌లైన్‌ను కనెక్ట్ చేసింది.
కిద్వాయ్ నగర్ వై బ్లాక్ లోని చాముండా పార్కు సమీపంలో గుంపుగా వచ్చిన కోతులు పైప్డ్ నేచురల్ గ్యాస్ (పిఎన్‌జి) పైప్‌లైన్‌ను పగులగొట్టాయి. దీంతో గ్యాస్ లీక్ అవుతుండటంతో ఇళ్లలోని ప్రజలు బయటకు పరుగులు తీశారు.గ్యాస్ లీకేజీకి భయపడి నివాసితులు ఇళ్ల నుంచి బయటకు వచ్చి సీయూజీఎల్ కంట్రోల్ రూంకు సమాచారం అందించారు. పెట్రోలింగ్ పోలీసు బృందం కూడా సంఘటనా స్థలానికి వచ్చింది. సీయూజీఎల్ అధికారులు గ్యాస్ సరఫరా నిలిపివేసి, పగిలిన పైప్‌లైన్‌కు మరమ్మతులు చేయడంతో ప్రజలంతా హమ్మయ్యా అని అనుకున్నారు.