మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ను ప్రకటించి భారతీయ జనతా పార్టీ సంచలన ప్రకటన చేసింది.
By Medi Samrat Published on 11 Dec 2023 3:30 PM GMTమధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ను ప్రకటించి భారతీయ జనతా పార్టీ సంచలన ప్రకటన చేసింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుండి సీఎం ను ప్రకటించేందుకు మధ్యప్రదేశ్ బీజేపీ, కేంద్రంలోని బీజేపీ తీవ్ర కసర్తత్తులు చేసింది. ఉజ్జయిని సౌత్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మోహన్ యాదవ్ ను సీఎం గా తాజాగా ప్రకటించారు. మోహన్ యాదవ్ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మధ్యప్రదేశ్ కు మొదటి యాదవ సామాజిక వర్గం నుంచి ఎన్నికయ్యారు సీఎం మోహాన్ యాదవ్. శివరాజ్ సింగ్ చౌహాన్ కేబినెట్ లో విద్యాశాఖమంత్రిగా పనిచేశారు మోహన్ దాస్. డిప్యూటీ సీఎం లుగా ఇద్దరికి అవకాశం కల్పించారు. జగదీష్ దేవ్డా, రాజేష్ శుక్లాను డిప్యూటీ సీఎంలుగా ప్రకటించారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్గా నరేంద్ర సింగ్ తోమర్ను నియమించారు.
1965 మార్చి 25న మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో జన్మించిన మోహన్ యాదవ్ చాలా ఏళ్లుగా బీజేపీలో కొనసాగుతున్నారు. రాజకీయాలతో పాటు వ్యాపారవేత్తగా కూడా గుర్తింపు పొందారు. ఇటీవలి 2023 మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో, మోహన్ యాదవ్ ఉజ్జయిని సౌత్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి చేతన్ ప్రేమనారాయణ్ యాదవ్‌పై 12,941 ఓట్ల తేడాతో విజయం సాధించారు.