ముగిసిన మోదీ టూర్

Modi Bangladesh Tour Completed. ప్రధాని మోదీ రెండు రోజుల బంగ్లాదేశ్‌ పర్యటన విజయవంతం గా ముగిసింది.

By Medi Samrat
Published on : 28 March 2021 9:34 AM IST

Modi Bangladesh Tour Completed

ప్రధాని మోదీ రెండు రోజుల బంగ్లాదేశ్‌ పర్యటన విజయవంతం గా ముగిసింది. తమ దేశంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా బంగ్లాదేశ్‌కు చెందిన 50 మంది పారిశ్రామికవేత్తలను ప్రధాని మోదీ ఆహ్వానించారు. పర్యటనలో భాగంగా భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య ఐదు అవగాహనా ఒప్పందాలు కుదిరాయి. ఈ ఒప్పందాలు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా పెంచుకునేందుకు ఉపయోగపడతాయని ఇరు దేశాల ప్రధానులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇక మోదీ బంగ్లాదేశ్ కు 1.2 మిలియన్ల కరోనా టీకా డోసులు బహుమానంగా ఇచ్చారు. ఆ దేశ ప్రధాని షేక్‌ హసీనాకు నేరుగా టీకా డోసుల బాక్సుని అందజేశారు. అలాగే 109 అంబులెన్సుల కానుకకు సూచికగా ఓ తాళం చెవిని కూడా ఆమెకు ఇచ్చారు. శుక్రవారం జరిగిన బంగ్లాదేశ్‌ విమోచన ఉద్యమం స్వర్ణోత్సవాల్లో గౌరవ అతిథిగా పాల్గొన్న మోదీ ఈ సందర్భంగా బంగబంధు ముజిబుర్‌ రెహ్మాన్‌కు భారత ప్రభుత్వం ప్రకటించిన గాంధీ శాంతి పురస్కారాన్ని ఆయన కుమార్తెలయిన ఆ దేశ ప్రధాని షేక్‌ హసీనా, ఆమె సోదరి షేక్‌ రెహానాలకు అందజేశారు.

షట్‌ఖిరా జిల్లాలోని ఈశ్వరీపూర్‌లో గల ప్రసిద్ధ జెషోరేశ్వరి కాళీ ఆలయాన్ని మోదీ సందర్శించారు.భారత్‌, పొరుగు దేశాల్లోని 51 శక్తిపీఠాల్లో జెషోరేశ్వరి కాళీ ఆలయం ఒకటి. 16వ శతాబ్దంలో హిందూ రాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది.

బంగ్లాదేశ్ ప‌ర్య‌ట‌న‌లో మ‌తువ తెగ‌ల‌తో మాట్లాడారు మోదీ . మ‌తువ కులస్థులు హిందూ మ‌తానికి చెందిన‌వారే. శూద్ర వ‌ర్ణానికి చెందిన వీరిని ఎస్సీలుగా గుర్తిస్తారు. బంగ్లాదేశ్‌లోని ఓరాకండిలో ఈ తెగ‌వ‌కు చెందిన వారి సంఖ్య అధికంగా ఉంది. మతువాలు పశ్చిమ బెంగాల్లో 11 నియోజకవర్గాల్లో ఎక్కువగా ఉన్నారు. వారి ఓట్లు అక్కడ కీలకం. దీంతో అటు ముస్లింలను, ఇటు హిందూవులను, మతువాలాంటి ప్ర జానీకానికి చేరువయ్యేందుకు ఈ టూర్‌ ద్వారా మోదీ యత్నించారని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు.






Next Story