జామియా నగర్.. చెక్క పెట్టెను తెరచి చూస్తే

ఢిల్లీలోని జామియా నగర్ ప్రాంతంలో ఇద్దరు మైనర్ల మృతదేహాలు వారి ఇంట్లో పాత చెక్క పెట్టెలో కనిపించడంతో ఆ ప్రాంతంలో తీవ్ర

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 Jun 2023 1:30 PM IST
Minor siblings,  Delhi, Jamia Nagar, Crime news

జామియా నగర్.. చెక్క పెట్టెను తెరచి చూస్తే

ఢిల్లీలోని జామియా నగర్ ప్రాంతంలో ఇద్దరు మైనర్ల మృతదేహాలు వారి ఇంట్లో పాత చెక్క పెట్టెలో కనిపించడంతో ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. 6, 8 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు పిల్లలు కనిపించకుండా పోయారు. తీరా చూస్తే చెక్క పెట్టెలో కనిపించారు. బాట్లా హౌస్‌లో ఈ సంఘటన జరిగింది. జోగా బాయి ఎక్స్‌టెన్షన్‌లోని ఓ ఇంటి వద్ద రెండు పిల్లల మృతదేహాలు కనిపించాయని జామియా నగర్ పోలీస్ స్టేషన్‌కు కాల్ వచ్చిందని పోలీసులు తెలిపారు.

జూన్ 6న ఫ్యాక్టరీలో చెక్క పెట్టెలో పిల్లలు చనిపోయి కనిపించారని పోలీసులు తెలిపారు. “జోగా బాయి ఎక్స్‌టెన్షన్‌లోని హౌస్ నంబర్. ఎఫ్2 లో ఇద్దరు పిల్లల మృతదేహాలు కనిపించాయని జామియా నగర్ పోలీస్ స్టేషన్‌కు కాల్ వచ్చింది. పిల్లలు తమ తండ్రి బల్బీర్‌తో కలిసి ఈ ఇంట్లో నివసిస్తున్నారు, అతను స్థానికంగా ఓ గార్డుగా పనిచేస్తున్నాడు, ” అని పోలీసులు తెలిపారు. మృతి చెందిన చిన్నారులు తల్లిదండ్రులతో కలిసి మధ్యాహ్నం 3 గంటలకు భోజనం చేశారు. ఆ తర్వాత 3.30 గంటల ప్రాంతంలో కనిపించకుండా పోయారని స్థానిక విచారణలో తేలింది. స్థానికంగా వారి కోసం వెతకడం ప్రారంభించారు. ఆ తరువాత వారి మృతదేహాలను చెక్క పెట్టెలో కనుగొన్నారు.

చిన్నారుల మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేవని, ప్రమాదవశాత్తూ ఊపిరి ఆడకుండా చనిపోయారని తెలుస్తోంది. ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు చెక్క పెట్టెలో ఇరుక్కుపోయారని, దీంతో ఊపిరాడక చనిపోయారని ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ అన్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి ఖచ్చితమైన కారణం తెలియనుంది.

Next Story