తెలుగు తమ్ముళ్లు ఓర్వలేకపోతున్నారు: మంత్రి రోజా

తుఫాను సమయంలో సీఎం జగన్ చేస్తున్న సహాయక చర్యలు చూసి తెలుగు తమ్ముళ్లు ఓర్వలేకపోతున్నారని మంత్రి రోజా విమర్శించారు.

By Medi Samrat  Published on  5 Dec 2023 6:15 PM IST
తెలుగు తమ్ముళ్లు ఓర్వలేకపోతున్నారు: మంత్రి రోజా

తుఫాను సమయంలో సీఎం జగన్ చేస్తున్న సహాయక చర్యలు చూసి తెలుగు తమ్ముళ్లు ఓర్వలేకపోతున్నారని మంత్రి రోజా విమర్శించారు. మొగుడు కొట్టినందుకు కాదు.. తోడికోడలు దెప్పినందుకు ఏడ్చిందన్న చందంగా టీడీపీ నాయకుల పరిస్థితి ఉందని మంత్రి రోజా వ్యంగ్యం ప్రదర్శించారు. అందుకే ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, పచ్చ మీడియాలో పిచ్చి కూతలు కూసి, పచ్చి రాతలు రాయించి పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే వాళ్ల హయాంలో చేసిన సహాయం గురించి మాట్లాడాలని, అలా కాకుండా చేతల ప్రభుత్వాన్ని విమర్శిస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని రోజా ఫైర్ అయ్యారు.

తుపాను దృష్ట్యా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులపై సీఎం జగన్‌ ఆరా తీశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్‌ సీఎస్‌ జి సాయి ప్రసాద్, సీసీఎల్‌ఏ సెక్రటరీ ఇంతియాజ్, సీఎంఓ అధికారులతో సీఎం జగన్‌ భేటీ అయ్యారు. బాధితులకు మంచి సదుపాయాలు అందించాలని.. సౌకర్యాల కల్పనలో ఎలాంటి పొరపాట్లు రాకుండా చూడాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. నెల్లూరు, తిరుపతి సహా తుపాను వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో కరెంటు సరఫరా వ్యవస్థను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలన్నారు. మనుషులు, పశువులు మరణించినట్టు సమాచారం అందితే 48 గంటల్లోగా పరిహారం అందించాలని తెలిపారు.

Next Story