తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గురువారం గుజరాత్‌లోని నర్మదా లోయలో ఉన్న సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహాన్ని సందర్శించారు. అనంతరం అక్కడి ఐమాక్స్ సమీపంలో 125 అడుగుల ఎత్తైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు అధ్యయనం చేశారు. వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీ, లేజర్ షో తదితర సౌకర్యాలను మంత్రి తనతోపాటు వచ్చిన సీనియర్ అధికారులతో కలిసి పరిశీలించారు.
విగ్రహ నిర్వహణ, ప్రాంగణం సమీపంలో జరుగుతున్న సుందరీకరణ పనులను కూడా మంత్రి కొప్పుల ఈశ్వర్ పరిశీలించారు. ఇక హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోయే అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని, ఇప్పటికే 40 శాతం పనులు పూర్తయ్యాయని మంత్రి కొద్దిరోజుల క్రితం తెలియజేశారు. న్యూఢిల్లీలో వివిధ రకాల విగ్రహాల తయారీలో ప్రసిద్ధి చెందిన వర్క్‌షాప్‌ను సందర్శించి వివిధ నమూనాలను మంత్రి పరిశీలించారు.