హై ఎండ్ కార్లలో వచ్చి.. పూల కుండీలను కొట్టేశారు..!

Men in high-end car steal flower pots. G-20 సదస్సు కోసం ఉంచిన పూల కుండీలను ఓ వ్యక్తి, అతని కారు డ్రైవర్ దొంగిలించారు

By M.S.R  Published on  28 Feb 2023 5:45 PM IST
హై ఎండ్ కార్లలో వచ్చి.. పూల కుండీలను కొట్టేశారు..!

ఢిల్లీ: ఢిల్లీ-గురుగ్రామ్ సరిహద్దులో G-20 సదస్సు కోసం ఉంచిన పూల కుండీలను ఓ వ్యక్తి, అతని కారు డ్రైవర్ దొంగిలించారు. డ్రైవరు పూల కుండీలను తీసుకోగా, ఆ వ్యక్తి వాటిని తమ కారులో పెట్టడానికి అతనికి సహాయం చేశాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఢిల్లీ-గురుగ్రామ్ సరిహద్దు సమీపంలో ఒక వ్యక్తి తన డ్రైవర్‌తో కలిసి కనిపించాడు. వీరిద్దరూ సర్హౌల్ సరిహద్దు దగ్గర ఉంచిన పూల కుండీలను దొంగిలిస్తున్నారు. డ్రైవర్ పూల కుండలను తీసుకోగా.. ఆ వ్యక్తి వాటిని తన కియా కార్నివాల్‌ కార్ లో ఉంచడానికి సహాయం చేశాడు.

సెప్టెంబర్‌లో జరగనున్న జి20 సమ్మిట్ కోసం ఢిల్లీ-ఎన్‌సిఆర్‌ ప్రాంతంలో సుందరీకరణ పనులు జరుగుతున్నాయి. అందులో భాగంగా పలు చోట్ల పూల కుండీలను ఉంచుతూ ఉన్నారు. అయితే ఇలా కొందరు ధనికులు కూడా ప్రభుత్వ సొమ్మును కొట్టేస్తూ ఉండడం నిజంగా శోచనీయం. అధికారులు ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతూ ఉన్నారు.


Next Story