అగ్నివీర్ ల గురించి మేఘాలయ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు

Meghalaya governor Satya Pal Malik has a fresh concern for Agniveers. కేంద్రం నూతనంగా ప్రవేశపెట్టిన అగ్నిపధ్ పథకంపై దేశ వ్యాప్తంగా నిరసన జ్వాలలు

By Medi Samrat
Published on : 27 Jun 2022 11:56 AM IST

అగ్నివీర్ ల గురించి మేఘాలయ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు

కేంద్రం నూతనంగా ప్రవేశపెట్టిన అగ్నిపధ్ పథకంపై దేశ వ్యాప్తంగా నిరసన జ్వాలలు చెలరేగిన సంగతి తెలిసిందే..! పలువురు నేతలు, పార్టీలు కూడా ఈ పథకాన్ని తీవ్రంగా విమర్శించాయి.

తాజాగా మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఈ పథకంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అగ్నిపధ్ సైనిక ఉద్యోగ అవకాశం కాదని యువతను దగా చేయడమే అని అన్నారు. రిటైర్ అయిన తరువాత పింఛన్లు ఉండకపోవడం ప్రయోజనకరం అవుతుందా? అని ప్రశ్నించారు. నాలుగేళ్లపాటు చిన్న తనంలోనే సైనికులుగా చేరి అగ్ని వీరులు అయ్యి బయటకు ఖాళీ చేతులతో పంపుతున్నారని అన్నారు. నిరుద్యోగంతో ఉన్న వారికి పెళ్లిళ్లు అవుతాయా?అని ప్రశ్నించారు. వారి భవిష్యత్తును అంధకారం లోకి నెట్టే విధంగా ఈ స్కీమ్ ఉందని.. ఆరోగ్య భీమాలు ఉండవు, జీవితాలు గడిపేందుకు పింఛన్లు దక్కవని అన్నారు. వ్యక్తిగత జీవితాలను వెక్కిరిస్తూ వారిని పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు ముందుకు రారని చెప్పుకొచ్చారు ఆయన.

"కాబోయే జవాన్లు ఆరు నెలల పాటు శిక్షణ ఇస్తారు, వారికి ఆరు నెలల సెలవు ఉంటుంది. మూడు సంవత్సరాల ఉద్యోగం తర్వాత, వారు తమ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, వారికి పెళ్లి ప్రతిపాదనలు రావు." అని ఆయన అన్నారు. అగ్నిపథ్ పథకం భవిష్యత్ జవాన్లకు వ్యతిరేకమే కాకుండా వారిని మోసం చేయడం అవుతుందని మాలిక్ వార్తా సంస్థ పిటిఐకి తెలిపారు.

'అగ్నిపథ్' పథకాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జూన్ 14న ఐఏఎఫ్, ఆర్మీ, నేవీకి చెందిన త్రివిధ దళాల అధిపతులతో కలిసి ప్రకటించారు. ఈ పథకం 17 మరియు 21 సంవత్సరాల వయస్సు గల యువ ఔత్సాహికులను నాలుగు సంవత్సరాల పదవీకాలానికి సాయుధ దళాలకు నియమించడం లక్ష్యంగా పెట్టుకుంది. నాలుగు సంవత్సరాల ముగింపులో, 75 శాతం మంది సేవ నుండి రిలీవ్ చేయబడతారు, మిగిలిన 25 శాతం మంది తదుపరి అంచనా తర్వాత 15 సంవత్సరాల కాలానికి సాధారణ కేడర్‌లలోకి చేర్చబడతారు.















Next Story