బాలికను కత్తెరతో కొట్టి.. స్కూల్‌ 1వ అంతస్తు నుంచి తోసేసిన టీచర్‌

MCD school teacher hits student, throws her from first floor. దేశ రాజధాని ఢిల్లీలోని ఓ ప్రాథమిక పాఠశాలో జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది.

By అంజి  Published on  16 Dec 2022 3:41 PM IST
బాలికను కత్తెరతో కొట్టి.. స్కూల్‌ 1వ అంతస్తు నుంచి తోసేసిన టీచర్‌

దేశ రాజధాని ఢిల్లీలోని ఓ ప్రాథమిక పాఠశాలో దారుణ ఘటన జరిగింది. మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ పాఠశాలకు చెందిన ఇద్దరు మహిళా ఉపాధ్యాయులు.. పరస్పర వాగ్వాదంలో 5వ తరగతి చదువుతున్న బాలిక వందనను పేపర్ కట్టర్‌తో కొట్టి, ఆపై మొదటి అంతస్తు నుండి కిందకు విసిరారు. దీంతో బాలిక తలకు గాయం కావడంతో హిందూరావు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. టీచర్ మొదటి అంతస్తు నుంచి బాలికను తోసేసినట్లు స్థానికులు డీబీజీ రోడ్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు.

ఈ సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫిల్మిస్థాన్‌లోని మోడల్ బస్తీ ప్రైమరీ స్కూల్‌లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థినిని గీతా దేశ్‌వాల్ అనే టీచర్ మొదటి అంతస్తు నుంచి కిందకు తోసేసినట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఈ ఘటనతో పాఠశాల వద్ద భారీగా జనం గుమిగూడారని పోలీసులు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు. అంతకుముందు టీచర్ బాలికను కొట్టింది.

గాయపడిన బాలిక తలకు గాయమైంది. చికిత్స కోసం బడా హిందూరావు ఆసుపత్రిలో చేర్చబడింది. చిన్నారి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని వైద్యులు తెలిపారు. నిందితురాలైప ఉపాధ్యాయురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాక్షుల వాంగ్మూలం ఆధారంగా టీచర్‌పై ఐపీసీ సెక్షన్ 307 కింద కేసు నమోదు చేశారు. టీచర్ మొదట కత్తెరతో కొట్టాడని బాధిత బాలిక ఆసుపత్రిలో తెలిపింది. టీచర్ తన జుట్టును కూడా కత్తిరించాడని ఆమెతో ఉన్న బాలిక ఏడుస్తూ చెప్పింది. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం మేరకు ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 307 కింద హత్యాయత్నం కేసు నమోదు చేస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సెంట్రల్) శ్వేతా చౌహాన్ తెలిపారు.

Next Story