ఢిల్లీలో భూకంపం.. భవనాల నుండి బయటకు పరుగులు

ఢిల్లీ పరిసర ప్రాంతాలు వణికిపోయాయి. బలమైన ప్రకంపనలకు కార్యాలయాలలో

By అంజి  Published on  3 Oct 2023 10:37 AM GMT
ఢిల్లీలో భూకంపం.. భవనాల నుండి బయటకు పరుగులు

ఢిల్లీ పరిసర ప్రాంతాలు వణికిపోయాయి. బలమైన ప్రకంపనలకు కార్యాలయాలలో ఫ్యాన్లు, లైట్లు వణికిపోయాయి. ఢిల్లీతో పాటు హర్యానా,ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌లో కూడా భూమి కంపించింది. చాలామంది జనం భయంతో పరుగులు పెట్టారు. నేపాల్‌లో మంగళవారం రిక్టర్ స్కేల్ పై 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. అనంతరం ఢిల్లీలో ప్రకంపనలు వచ్చాయి. భూకంప కేంద్రాన్ని నేపాల్‌లో గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ పేర్కొంది.ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో దాదాపు నిమిషం పాటు భూమి కంపించింది. భూ ప్రకంపనల ధాటికి ప్రజలు భయాందోళకు గురయ్యారు.

ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. '3-10-2023 మధ్యాహ్నం 2.51 గంటలకు నేపాల్‌లో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది' అని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ ఓ ప్రకటనలో తెలిపింది. ఢిల్లీ-ఎన్‌సిఆర్, పంజాబ్, హర్యానాతో సహా ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో ఒక నిమిషం పాటు కొనసాగిన బలమైన భూకంప ప్రకంపనలు రావడంతో భవనాల నుండి బయటకు వచ్చారు.


Next Story