విషాదం.. అమెరికాలో తెలుగు విద్యార్థులు మృతి

అమెరికా బర్మింగ్‌హామ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభ‌వించింది.

By -  Medi Samrat
Published on : 5 Dec 2025 9:14 PM IST

విషాదం.. అమెరికాలో తెలుగు విద్యార్థులు మృతి

అమెరికా బర్మింగ్‌హామ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభ‌వించింది. ఈ ప్ర‌మాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందారు. అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో పదిమంది తెలుగు విద్యార్థులు నివసిస్తున్నారు. హఠాత్తుగా చెలరేగిన మంటలతో అంద‌రూ ఉక్కిరిబిక్కిరయ్యారు. అపార్ట్‌మెంట్‌లో ఫైర్ ప్రారంభమైన‌ కాసేపటిలోనే ఘాటైన పొగ రావ‌డంతో.. విద్యార్థులు శ్వాస తీసుకోలేక భయంతో అరుపులు పెట్టారు. ఆ స‌మ‌యంలో లోపల చిక్కుకుపోయిన 13 మంది విద్యార్థులను అగ్నిమాపక సిబ్బంది బయటకు తీసుకొని వచ్చింది. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హైదరాబాద్ చెందిన ఆ ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందారు. మృతి చెందిన విద్యార్థులు అలబామా యూనివర్సిటీలో ఉన్నత విద్య చదువుతున్నట్లు గుర్తించారు.

Next Story