ఇంట్లో పేలిన ఏసీ యూనిట్‌.. భారీగా చెలరేగిన మంటలు

ఓ ఇంట్లో గురువారం నాడు ఎయిర్ కండిషనింగ్ (ఏసీ) యూనిట్‌ పేలింది. దీంతో మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు.

By అంజి  Published on  6 Jun 2024 4:38 AM GMT
fire, Ghaziabad, AC unit , heat

ఇంట్లో పేలిన ఏసీ యూనిట్‌.. భారీగా చెలరేగిన మంటలు

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని హౌసింగ్ సొసైటీలోని ఓ ఇంట్లో గురువారం నాడు ఎయిర్ కండిషనింగ్ (ఏసీ) యూనిట్‌ పేలింది. దీంతో మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. ఘజియాబాద్‌లోని వసుంధరలోని సెక్టార్ 1లో ఉన్న రెసిడెన్షియల్ సొసైటీ వద్ద ఉన్న ఉన్న ఓ ఇంటిలో ఈ ఘటన జరిగింది. నగరంలో అత్యంత వేడిగా ఉండే ఉష్ణోగ్రతల కారణంగా కొన్ని గంటలపాటు నిరంతరాయంగా రన్నింగ్‌లో ఉంచిన ఏసీ పరికరం పేలి పగిలిపోవడంతో వెలుగులోకి వచ్చింది.

"ఈరోజు ఉదయం 05:30 గంటలకు, ఘజియాబాద్, వైశాలిలోని అగ్నిమాపక కేంద్రంకు ఇంటి నంబర్-1009, సెక్టార్-01 వసుంధర ప్రాంతంలో అగ్నిప్రమాదం గురించి నివాసి నుండి కాల్ వచ్చింది. సమాచారం అందిన వెంటనే, యూనిట్లతో కూడిన రెండు అగ్నిమాపక యంత్రాలు రెండవ అగ్నిమాపక అధికారితో సహా అగ్నిమాపక కేంద్రం వైశాలి నుండి సంఘటనా స్థలానికి చేరుకున్నారు" అని చీఫ్ ఫైర్ ఆఫీసర్ రాహుల్ పాల్ తెలిపారు.

నివేదికల ప్రకారం, పరికరంలో పేలుడు సంభవించిన తర్వాత భవనంలోని మొదటి అంతస్తులో అమర్చిన ఏసీ మంటల్లో చిక్కుకుంది. వెంటనే మంటలు రెండో అంతస్తుకు చేరాయి. స్థానిక అగ్నిమాపక శాఖకు సమాచారం అందించగా ఇంట్లోని వ్యక్తులతో పాటు ఇరుగుపొరుగు వారు మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. సమీపంలోని అగ్నిమాపక శాఖ ద్వారా కనీసం రెండు ఫైర్ టెండర్లు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే చర్యలు ప్రారంభించాయి. చాలా అవాంతరాల తర్వాత మంటలను ఆర్పివేశాయి.

ముందుజాగ్రత్త చర్యగా వంటగ్యాస్‌ కనెక్షన్‌ను అధికారులు నిలిపివేసి మరింత ప్రమాదాన్ని నివారించారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే చర్యలు చేపట్టి సమీపంలోని ఇళ్లను కూడా రక్షించారు. మంటల్లో కొన్ని వస్తువులు కాలిపోయాయి, మంటల వేడికి ఇంట్లో ఉంచిన కొన్ని వస్తువులు కరిగిపోయి పాడైపోయాయి. అయితే, ఎటువంటి నష్టం జరగలేదని చీఫ్‌ ఫైర్‌ ఆఫీసర్‌ తెలిపారు.

Next Story