ప్రసాదాన్ని సిద్ధం చేస్తోండగా పేలిన సిలిండర్లు.. 30 మందికి తీవ్రగాయాలు
Massive Fire During Chhath Puja At Bihar's Aurangabad.ఛట్ పూజ కు ప్రసాదాన్ని సిద్దం చేస్తోండగా సిలిండర్లు పేలిపోయాయి
By తోట వంశీ కుమార్ Published on 29 Oct 2022 7:22 AM GMTఛట్ పూజ కు ప్రసాదాన్ని సిద్దం చేస్తోండగా సిలిండర్లు పేలిపోయాయి. ఈ ప్రమాదంలో 30 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన బిహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్‌లో శనివారం తెల్లవారుజామున జరిగింది.
శాహ్‌గంజ్ ప్రాంతంలో ఛట్ పూజ నిమిత్తం శనివారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో అనిల్ గోస్వామి కుటుంబం ప్రసాదాన్ని తయారు చేసే పనిలో నిమగ్నమైంది. అయితే.. షార్ట్‌సర్కూట్ కారణంగా మంటలు చెలరేగి సిలిండర్లకు అంటుకున్నాయి. గ్యాస్ లీకేజీకి అయ్యింది. భారీగా మంటలు వ్యాపించాయి. చుట్టు పక్కల ఉన్నస్థానికులు అక్కడకు చేరుకుని మంటలను ఆర్పేందుకు సిలిండర్లపై నీటిని విసిరినప్పుడు సిలిండర్ పేలింది. దీంతో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
Aurangabad, Bihar| Injuries reported after fire broke out in a shop y'day, no casualties reported yet
— ANI (@ANI) October 29, 2022
We were preparing for Chhath puja, my wife was making meals. A sudden fire broke out at my shop after a cylinder there exploded. My family members were injured: Anil, Shopkeeper pic.twitter.com/ej0Dh31qj8
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను ఆర్పే క్రమంలో పలువురు సిబ్బంది కూడా గాయపడ్డారు. క్షతగాత్రులను ఔరంగాబాద్ సదర్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. చాలా మంది ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లలో చేరి చికిత్స పొందుతున్నారు. కాగా.. ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.