గఫార్ మార్కెట్‌లో భారీ అగ్నిప్ర‌మాదం.. 39 ఫైరింజ‌న్లతోటి

Massive fire breaks out in Karol Bagh's Gaffar market.దేశ రాజధాని ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతంలో ఆదివారం భారీ

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 12 Jun 2022 9:19 AM IST

గఫార్ మార్కెట్‌లో భారీ అగ్నిప్ర‌మాదం.. 39 ఫైరింజ‌న్లతోటి

దేశ రాజధాని ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతంలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కరోల్ బాగ్‌లోని గఫార్ మార్కెట్‌లో తెల్ల‌వారుజామున మంటలు చెలరేగాయి. క్ర‌మంగా అవి మార్కెట్ మొత్తానికి వ్యాపించాయి. భారీ ఎత్తున మంట‌లు ఎగిసిప‌డ్డాయి. దీంతో ఆ ప్రాంతంలో ద‌ట్ట‌మైన పొగ క‌మ్ముకుంది. స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు.

39 ఫైరింజన్లతో మంట‌ల‌ను ఆర్పివేశారు. ప్ర‌స్తుతం మంట‌లు అదుపులోకి వ‌చ్చాయి. ఢిల్లీ ఫైర్ సర్వీస్ ప్రకారం.. లోపల ఎవరూ చిక్కుకోలేదు. ఇప్పటి వరకు ఎటువంటి గాయాలు సంభవించలేదు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story