అతిపెద్ద వ్యాక్సిన్‌ తయారీదారు సీరం సంస్థలో భారీ అగ్ని ప్రమాదం..!

Massive fire at Serum Institute of India's plant in Pune. అతిపెద్ద వ్యాక్సిన్‌ తయారీదారు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థలో భారీ అగ్ని ప్రమాదం.

By Medi Samrat  Published on  21 Jan 2021 10:10 AM GMT
Massive fire at Serum Institute of Indias plant in Pune

అతిపెద్ద వ్యాక్సిన్‌ తయారీదారు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పూణేలోని సీరం సంస్థ మాంజ్రీ ప్లాంట్‌లోని టెర్మినల్-1 గేట్ వద్ద మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇటీవలి కాలంలో కరోనా వ్యాక్సిన్ తయారీ విషయంలో సీరం సంస్థ పేరు బాగా వినిపిస్తూ వచ్చింది. ఆక్స్‌ఫర్డ్‌ ఆస్ట్రా జెనెకా అభివృద్ధి చేసిన 'కోవిషీల్డ్' వ్యాక్సిన్‌ను సీరం భారీ ఎత్తున తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కోవీషీల్డ్‌ టీకాలు ప్రమాదం జరినగిన ఈ ప్లాంట్‌లో తయారు కావడం లేదని సమాచారం.

పూణే లోని మాంజ్రీ ప్లాంట్‌ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం అగ్ని ప్రమాదం జరిగిన బిల్డింగ్ లో ఎవరూ లేరు.




Next Story