మావోయిస్టులకు బిగ్ షాక్..అగ్రనేత మల్లోజుల లొంగుబాటు

మావోయిస్టు అగ్రనేత, పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్‌ రావు అలియాస్‌ సోను పోలీసుల ఎదుట లొంగిపోయారు

By -  Knakam Karthik
Published on : 14 Oct 2025 1:10 PM IST

National News, Chhattisgarh, Mallojula Venugopal

మావోయిస్టులకు బిగ్ షాక్..అగ్రనేత మల్లోజుల లొంగుబాటు

మావోయిస్టులకు మరో బిగ్ షాక్ తగిలింది. మావోయిస్టు అగ్రనేత, పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్‌ రావు అలియాస్‌ సోను పోలీసుల ఎదుట లొంగిపోయారు. 60 మంది మావోయిస్టులతో కలిసి ఆయన గడ్చిరోలి పోలీసులకు లొంగిపోయినట్లు ఛత్తీస్‌గఢ్‌ ఉపముఖ్యమంత్రి విజయ్‌శర్మ తెలిపారు. మావోయిస్టు నేతలు జనజీవన స్రవంతిలో కలవడాన్ని స్వాగతిస్తున్నామని, అలా చేయకుంటే సాయుధ దళాలు సరైన పద్ధతిలో జవాబిస్తాయని విజయ్‌శర్మ పేర్కొన్నారు. నక్సలిజం అంతం కావాలని బస్తర్ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారని వివరించారు.

1970లో మల్లోజుల మావోయిస్టు పూపుల్‌స్‌ గ్రూప్‌లో చేరారు. మావోయిస్టు అగ్రనేత మల్లోజుల కోటేశ్వర్‌రావు అలియాస్ కిషన్ జీకి ఈయన తమ్ముడు. పార్టీ విధివిధానాల రూపకల్పనలో కీలకపాత్ర పోషించిన మల్లోజుల తలపై ఆరు కోట్లకు పైగా నజరానా ఉంది. ఇటీవలే కాల్పుల విరమణ, శాంతి చర్చల పేరుతో ఈయన అభయ్‌ పేరుతో కరపత్రాలు విడుదల చేశారు.

కాగా 2026 మార్చి 31 నాటికి మవోయిస్టులను తుది ముట్టిస్తామని అమిత్ షా ఇదివరకే ప్రకటించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాష్ట్ర ప్రభుత్వాల నాయకత్వంలో దేశవ్యాప్తంగా అందులో భాగంగా ఆపరేషన్​ కగార్‌ను ముమ్మరం చేశారు. ఛత్తీస్‌గఢ్, దేశంలోని ఇతర ప్రాంతాలలోని మావోయిస్టు కార్యకర్తల నుంచి అతనికి మద్దతు లభించింది.

ఈ సంవత్సరం ఛత్తీస్‌గఢ్‌లో రికార్డు స్థాయిలో 1,040 మంది కేడర్లు ఆయుధాలు విడిచిపెట్టారు మరియు కేంద్ర సాయుధ పోలీసు దళాల అధికారులు ఈ వారంలో మధ్య స్థాయి నుండి సీనియర్ స్థాయి కేడర్లు మరో రౌండ్ లొంగిపోయే అవకాశం ఉందని ఆశిస్తున్నారు , దీని కోసం మధ్యవర్తులు బలగాలను సంప్రదించారు.

Next Story