మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్

కీలక మావోయిస్టు నేత కుంజం హిడ్మా అరెస్ట్ అయ్యారు. కొరాపూట్‌లో హిడ్మాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

By Medi Samrat
Published on : 29 May 2025 5:26 PM IST

మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్

కీలక మావోయిస్టు నేత కుంజం హిడ్మా అరెస్ట్ అయ్యారు. కొరాపూట్‌లో హిడ్మాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి ఏకే 47తో పాటు పలు పేలుడు పదార్థాలకు సంబంధించిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ ట్రై-జంక్షన్ అంతటా మావోయిస్టు కార్యకలాపాలకు హిడ్మా అరెస్టు ఊహించని దెబ్బగా చెప్పుకోవచ్చు. హిడ్మాను అరెస్ట్ చేయడమే కాకుండా AK-47 రైఫిల్, 35 రౌండ్ల మందుగుండు సామగ్రి, 117 డిటోనేటర్లు (ఎలక్ట్రిక్, నాన్-ఎలక్ట్రిక్), గన్‌పౌడర్, రేడియోలు, కత్తులు, మావోయిస్టు సాహిత్యం, పలు ఆయుధాలు, మావోయిస్టు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి భారీగా పేలుడు పదార్థాలును తీసుకువస్తున్నారన్న విశ్వసనీయ వర్గాల సమాచారంతో హిడ్మాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

హిడ్మా ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలోని పువ్వర్తి గ్రామంలో 1980లో జన్మించాడు. హిడ్మా చిన్న వయసులోనే మావోయిస్టు భావజాలానికి ఆకర్షితులయ్యాడు. తన 16వ ఏట 1996లో మావోయిస్టు పార్టీలో గ్రామ కమిటీలో సభ్యుడిగా చేరి నేతగా ఎదిగాడు.

Next Story