Video : ప్రభుత్వ లాంఛనాలతో మనోజ్‌కుమార్ అంత్యక్రియలు.. వీడ్కోలు పలికిన సినీ తారలు

ప్రముఖ బాలీవుడ్ నటుడు మనోజ్ కుమార్ (87) కన్నుమూశారు. సినీ తెరపై 'భరత్ కుమార్'గా పిలుచుకునే నటుడు శుక్రవారం ఉదయం ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు.

By Medi Samrat
Published on : 5 April 2025 1:27 PM IST

Video : ప్రభుత్వ లాంఛనాలతో మనోజ్‌కుమార్ అంత్యక్రియలు.. వీడ్కోలు పలికిన సినీ తారలు

ప్రముఖ బాలీవుడ్ నటుడు మనోజ్ కుమార్ (87) కన్నుమూశారు. సినీ తెరపై 'భరత్ కుమార్'గా పిలుచుకునే నటుడు శుక్రవారం ఉదయం ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. మనోజ్ కుమార్ మృతితో హిందీ చిత్రసీమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. బాలీవుడ్ మొత్తం విషాదంలో మునిగిపోయింది. మనోజ్ కుమార్ అంత్యక్రియలు ఏప్రిల్ 5న ప్రభుత్వ లాంఛనాలతో నిర్వ‌హించనున్నారు.

ఆయనకు వీడ్కోలు పలికేందుకు సినీ తారలు ఒకరి తర్వాత ఒకరు చేరుకున్నారు. తనతో పాటు పలు చిత్రాల్లో పనిచేసిన ప్రముఖ నటుడు ధర్మేంద్ర కూడా విషాదంలో మునిగిపోయారు. అలాగే నటుడు ప్రేమ్ చోప్రా కూడా మనోజ్ కుమార్‌కు వీడ్కోలు పలికేందుకు వచ్చారు.

మనోజ్ కుమార్ అంత్యక్రియలు పవన్ హన్స్ శ్మశాన వాటికలో జరుగుతున్నాయి. మనోజ్ కుమార్‌ను గుర్తు చేసుకుంటూ రాజ్‌పాల్ యాదవ్, 'అతను భారతదేశపు ప్రపంచ కళా రత్నం. ఆయన భారతరత్న. నేను ఆయనకు నమస్కరిస్తున్నాను. ఆయ‌న‌ మన బాలీవుడ్ రత్నం అని పేర్కొన్నారు.

ప్రేమ్ చోప్రా మాట్లాడుతూ.. 'మేము మొదటి నుండి కలిసి ఉన్నాము. ఇది అద్భుతమైన ప్రయాణం. ఆయనతో పని చేయడం వల్ల అందరూ లాభపడ్డారు. నేను కూడా ఆయ‌న వ‌ల్ల‌ చాలా సంపాదించాను. ఆయ‌న‌ నాకు చాలా మంచి స్నేహితుడు, నిజానికి ఆయ‌న‌ నా బెస్ట్ ఫ్రెండ్స్‌లో ఒకడని చెప్పగలను.

24 జూలై 1937న జన్మించిన మనోజ్ కుమార్ అసలు పేరు హరికిషన్ గిరి గోస్వామి. బుల్లితెరపై ఎన్నో పాత్రలకు ప్రాణం పోసి.. దేశభక్తి చిత్రాలతో మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. అందుకే అతన్ని భరత్ కుమార్ అని పిలిచేవారు.

మనోజ్ కుమార్ భారతీయ సినిమాకు చేసిన అద్భుతమైన సేవలకు అనేక అవార్డులను గెలుచుకున్నారు. భారత ప్రభుత్వం 1992లో పద్మశ్రీ, 2016లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులతో సత్కరించింది. ఇది కాకుండా ఆయ‌న 1968లో 'ఉప్కార్' కోసం ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ కథ, ఉత్తమ సంభాషణ అవార్డులతో సహా 7 ఫిల్మ్‌ఫేర్ అవార్డులను కూడా అందుకున్నాడు. ఆయ‌న‌ జాతీయ అవార్డుతో కూడా సత్కరించబడ్డాడు.

Next Story