ఢిల్లీ లిక్కర్ స్కామ్.. సీబీఐ తుది ఛార్జ్‌షీట్‌పై విచారణ వాయిదా

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ తుది ఛార్జ్‌షీట్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది.

By Medi Samrat  Published on  11 Sep 2024 1:39 PM GMT
ఢిల్లీ లిక్కర్ స్కామ్.. సీబీఐ తుది ఛార్జ్‌షీట్‌పై విచారణ వాయిదా

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ తుది ఛార్జ్‌షీట్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. రౌస్ అవెన్యూ కోర్టులో లిక్కర్ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్‌పై స్పెషల్ కోర్టు జడ్జి కావేరి బవేజా విచారణ జరిపారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఆప్ నేత మనీష్ సిసోడియా, ఇతర నిందితులు కోర్టుకు వర్చువల్‌గా హజరయ్యారు. ప్రతివాదులు అడిగిన కాపీలను ఇవ్వాలని సీబీఐని మరోసారి కోర్టు ఆదేశించింది. దీంతో సీబీఐ తుది ఛార్జ్‌షీట్‌పై విచారణను ఈనెల 25కు వాయిదా వేసింది. పలువురికి బెయిల్ వచ్చినా ఈ కేసులో ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికి జైలులోనే ఉన్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో రామచంద్రన్ పిళ్లైకి బెయిల్ లభించింది. అరుణ్ రామచంద్రన్ పిళ్లై హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త. పిళ్లై ఇండోస్పిరిట్ లిక్కర్ కంపెనీ ఎండీ సమీర్ మహేంద్రు నుంచి లంచాలు స్వీకరించి, ఆ లంచాలను ఈ కేసులో ఇతర నిందితులకు అందించాడన్నది అతడిపై ఉన్న ప్రధాన అభియోగం. విచారణ సమయంలో పిళ్లై తప్పుడు వాంగ్మూలం ఇచ్చాడని, సాక్ష్యాధారాలను నాశనం చేయడంలో అతడి పాత్ర కూడా ఉందని ఈడీ ఆరోపిస్తోంది.

Next Story