బీజేపీని వీడి పీకే పార్టీలో చేరిన కీల‌క నేత‌

బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ వేడి పెరుగుతోంది.

By Medi Samrat
Published on : 7 July 2025 2:45 PM IST

బీజేపీని వీడి పీకే పార్టీలో చేరిన కీల‌క నేత‌

బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ వేడి పెరుగుతోంది. కాగా, ప్రముఖ యూట్యూబర్ మనీష్ కశ్యప్ బీజేపీకి గుడ్ బై చెప్పి ప్రశాంత్ కిషోర్ జన్ సూరజ్ పార్టీలో చేరారు. జన్ సూరజ్ తన X హ్యాండిల్‌లో మనీష్ కశ్యప్, ప్రశాంత్ కిషోర్ చిత్రాలకు సంబంధించిన ఫోటోల‌ను పంచుకుంది. ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

జన్ సూరజ్ పార్టీలో చేరిన తర్వాత మనీష్ కశ్యప్ మాట్లాడుతూ.. ఈ రోజు బీహార్ వాస్తవికత అందరికీ తెలుసునని పేర్కొన్నారు. బీహార్‌లో ఎవరూ సురక్షితంగా లేరని.. మీరు బీహార్‌ను సురక్షితంగా చేయాలనుకుంటే.. జన్ సూరజ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండని పిలుపునిచ్చారు.

అంత‌కుముందు మనీష్ కశ్యప్ తన చిత్రాలలో కొన్నింటిని ప్రశాంత్ కిషోర్‌తో Xలో పంచుకున్నారు. ఆయ‌న‌ ఇలా వ్రాశారు.. మేము ఆరిపోయిన ఆశ‌ల‌తో తిరిగి పుంజుకుంటాము, ప్రతి ఇంటికి వెలుగు తెస్తాము, వలసల బాధను తొలగిస్తాము, మేము మళ్లీ కొత్త బీహార్‌ను సృష్టిస్తామని పేర్కొన్నారు.

Next Story