ఊహించని షాక్.. రాహుల్ యాత్రకు నో పర్మిషన్

గత ఏడాది కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర' చేపట్టారు. ఈ ఏడాది రాహుల్ గాంధీ 'భారత్ న్యాయ్ యాత్ర' చేపట్టబోతున్నారు.

By Medi Samrat  Published on  10 Jan 2024 6:36 PM IST
ఊహించని షాక్.. రాహుల్ యాత్రకు నో పర్మిషన్

గత ఏడాది కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర' చేపట్టారు. ఈ ఏడాది రాహుల్ గాంధీ 'భారత్ న్యాయ్ యాత్ర' చేపట్టబోతున్నారు. అయితే మణిపూర్ ప్రభుత్వం రాహుల్ గాంధీ యాత్రకు అనుమతి నిరాకరించింది. భారత్‌ జోడో న్యాయ్ యాత్రకు ప్రారంభ వేదికకు అనుమతి నిరాకరణపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పందించారు. మణిపూర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వారం రోజుల క్రితం అనుమతి కోసం చీఫ్ సెక్రటరీకి లేఖ ఇచ్చారు. ఐదు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మూడు రోజుల క్రితం స్వయంగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడే ఆయనను కలవడానికి వెళ్లారు. ఇంఫాల్ ప్యాలెస్ గ్రౌండ్‌లో అనుమతి ఇవ్వడం లేదని సమాచారం వచ్చిందని కేసీ వేణుగోపాల్ వెల్లడించారు.

మేం ఎలాంటి డ్రామా సృష్టించడం లేదు.. ఈ యాత్ర దేశం కోసమే.. ప్యాలెస్ గ్రౌండ్ ఇవ్వకుంటే ఇబ్బంది లేదు, మరో స్థలాన్ని ఎంచుకుంటామని కేసీ వేణుగోపాల్ అన్నారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర ఇంఫాల్ నుంచే ప్రారంభమవుతుంది.. రేపటిలోగా అందరికీ కొత్త ప్రదేశానికి సంబంధించిన సమాచారం తెలియజేస్తామని ఆయన తెలిపారు.

Next Story