గణేష్ చతుర్థి వేడుకల్లో.. బురఖా ధరించి డ్యాన్స్

గణేష్ చతుర్థి వేడుకల్లో బురఖా ధరించి డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్ కావడంతో

By Medi Samrat  Published on  24 Sept 2023 7:28 PM IST
గణేష్ చతుర్థి వేడుకల్లో.. బురఖా ధరించి డ్యాన్స్

గణేష్ చతుర్థి వేడుకల్లో బురఖా ధరించి డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్ కావడంతో తమిళనాడులోని వెల్లూరుకు చెందిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 21న గణేష్ చతుర్థి సందర్భంగా ఓ వ్యక్తి బురఖా ధరించి డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్‌గా మారిందని, దీనిపై చర్యలు తీసుకోవాలని కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా.. ఒక పోలీసు బృందం దర్యాప్తు ప్రారంభించింది. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి విరుతంపట్టుకు చెందిన అరుణ్‌కుమార్‌గా గుర్తించారు.

ఇరువర్గాల మధ్య విద్వేషాలు పెంచేందుకు ప్రయత్నించిన అరుణ్‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీసేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న మరికొందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. తదుపరి విచారణ జరుపుతున్నారు.

Next Story