గాల్లో మహిళకి లైంగిక వేధింపులు.. కిందకు దిగాక అరదండాలు

ఢిల్లీ నుండి గోవా కు వెళుతున్న ఎయిర్ ఇండియా విమానంలో తోటి మహిళా ప్రయాణీకురాలిని లైంగికంగా వేధించిన ఆరోపణలపై దబోలిమ్ విమానాశ్రయ పోలీసులు 23 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు అధికారులు ధృవీకరించారు

By Medi Samrat  Published on  20 Nov 2024 12:30 PM GMT
గాల్లో మహిళకి లైంగిక వేధింపులు.. కిందకు దిగాక అరదండాలు

ఢిల్లీ నుండి గోవా కు వెళుతున్న ఎయిర్ ఇండియా విమానంలో తోటి మహిళా ప్రయాణీకురాలిని లైంగికంగా వేధించిన ఆరోపణలపై దబోలిమ్ విమానాశ్రయ పోలీసులు 23 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు అధికారులు ధృవీకరించారు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్ఐఆర్) ప్రకారం మంగళవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:20 గంటల మధ్య ఎయిర్ ఇండియా విమానంలో ఈ ఘటన జరిగింది. ఎవరో తన ఒంటిపై చేయి వేసినట్లు గుర్తించిన మహిళ గట్టిగా అరవడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

న్యూఢిల్లీలోని జనక్‌పురి నివాసి అయిన 28 ఏళ్ల మహిళ ఫిర్యాదు మేరకు విమానం గాలిలో ఉన్నప్పుడు తన పక్కన కూర్చున్న వ్యక్తి తనతో అనుచితంగా ప్రవర్తించాడని పోలీసులకు తెలిపింది. ఉద్దేశపూర్వకంగా దుప్పటి ఒక వైపు భాగాన్ని నిందితుడు తెరిచాడు. గోవాలోని దబోలిమ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగగానే బాధితురాలు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని హర్యానా పానిపట్‌కు చెందిన జితేందర్ జాంగియాన్‌గా గుర్తించారు. అతడిని అరెస్టు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. నిందితుడిపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 75, 79 కింద కేసు నమోదు చేశారు.

Next Story