Video : హిట్ అండ్ ర‌న్.. కారు ఢీ కొట్ట‌డంతో గాల్లో ఎగిరిపడ్డ యువ‌కుడు

మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో 24 ఏళ్ల యువకుడిని వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో గాలిలో ఎగిరి పడ్డాడు.

By Medi Samrat  Published on  31 Aug 2024 7:15 PM IST
Video : హిట్ అండ్ ర‌న్.. కారు ఢీ కొట్ట‌డంతో గాల్లో ఎగిరిపడ్డ యువ‌కుడు

మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో 24 ఏళ్ల యువకుడిని వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో గాలిలో ఎగిరి పడ్డాడు. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. రోహిత్ సఖారం హప్పే అనే వ్యక్తిని వెనుక నుంచి కారు ఢీకొట్టినట్లు సీసీటీవీ ఫుటేజీలో చూడొచ్చు. ఘటనా స్థలం నుంచి కారు వేగంగా వెళుతుండగా ఒక్కసారిగా తాకగా ఆ వ్యక్తి గాలిలోకి ఎగిరిపోవడం కనిపించింది.

బాధితుడు ఆగస్టు 28న తన పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. తలకు, రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఇంకా డ్రైవర్‌ను, ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించలేదు. గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశామని, అధికారులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Next Story