నిప్పంటించుకుని పార్లమెంట్ వైపు పరిగెత్తిన వ్య‌క్తి

బుధవారం నాడు పార్లమెంటు సమీపంలో ఓ వ్యక్తి తనకు తాను నిప్పంటించుకున్నాడు.

By Medi Samrat  Published on  25 Dec 2024 5:50 PM IST
నిప్పంటించుకుని పార్లమెంట్ వైపు పరిగెత్తిన వ్య‌క్తి

బుధవారం నాడు పార్లమెంటు సమీపంలో ఓ వ్యక్తి తనకు తాను నిప్పంటించుకున్నాడు. గుర్తు తెలియని వ్యక్తికి తీవ్ర కాలిన గాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలిలో సగం కాలిపోయిన రెండు పేజీల నోట్ కనుగొన్నారు. ఘటనా స్థలంలో అధికారులు పెట్రోల్‌ను కూడా కనుగొన్నారు మరియు తదుపరి తనిఖీలు కొనసాగుతున్నాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, భారతీయ రైల్వే ప్రధాన కార్యాలయం రైల్ భవన్ సమీపంలోని పార్కులో వ్యక్తి తనకు తాను నిప్పంటించుకుని, ఆపై పార్లమెంటు హౌస్ వైపు పరుగెత్తాడు. ఢిల్లీ పోలీసులు, ఫోరెన్సిక్ టీమ్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు, దర్యాప్తు ప్రారంభించామని అధికారులు తెలిపారు. వ్యక్తి వివరాలు,ఈ చర్య వెనుక ఉద్దేశ్యం ఇంకా నిర్ధారించలేదు.

Next Story