మెట్రో లోపల బీడీ అంటించాడు

మెట్రోలో బీడీ తాగుతున్న ప్రయాణీకుడికి సంబంధించిన వీడియో వైరల్ అవుతూ ఉంది.

By Medi Samrat  Published on  25 Sept 2023 7:19 PM IST
మెట్రో లోపల బీడీ అంటించాడు

మెట్రోలో బీడీ తాగుతున్న ప్రయాణీకుడికి సంబంధించిన వీడియో వైరల్ అవుతూ ఉంది. మెట్రోలో ప్రయాణించే సమయంలో ధూమపానం చేయకూడదు. ధూమపానం ఖచ్చితంగా నిషేధించారు. అది శిక్షార్హమైన నేరం. అయితే ఓ వ్యక్తి మెట్రో లోపల బీడీ తాగుతున్న వీడియోను పలువురు షేర్ చేశారు. ఇది ఢిల్లీలో చోటు చేసుకుందని పలువురు చెబుతున్నారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC)ని పలువురు కోరారు.

మెట్రోలో ఓ వ్యక్తి కూర్చుని ఉన్న వీడియో వైరల్‌గా మారింది. ఆ తర్వాత కోచ్ లోపల బీడీ వెలిగించి పొగ తాగడం ప్రారంభించాడు. మొదట్లో ఎవరూ అడ్డుకోనప్పటికీ, ఒక సహ-ప్రయాణికుడు బీడీ వైపు చూపిస్తూ అతనితో మాట్లాడడం వీడియోలో రికార్డు అయింది. మెట్రో లోపల పొగ తాగకూడదని ఆయన కోరినట్లు కనిపిస్తోంది. ఈ క్లిప్‌లో కనిపించిన వ్యక్తి గుర్తింపును నిర్ధారించాల్సి ఉంది. ఢిల్లీ మెట్రో తరచుగా వివాదాల కారణంగా వార్తల్లో నిలుస్తూ ఉంది. ఇప్పుడు ఈ వీడియో కారణంగా కూడా వార్తల్లో నిలిచింది.

Next Story