తల్లి మృతదేహంతో రోజుల తరబడి ఇంట్లోనే.. అంత్యక్రియలు చేయడానికి డబ్బు లేక

Man hides mother’s body in house for days; claims had no money to perform last rites. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఓ హృదయ విదాకర ఘటన వెలుగులోకి వచ్చింది.

By అంజి
Published on : 14 Dec 2022 10:43 AM IST

తల్లి మృతదేహంతో రోజుల తరబడి ఇంట్లోనే.. అంత్యక్రియలు చేయడానికి డబ్బు లేక

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఓ హృదయ విదాకర ఘటన వెలుగులోకి వచ్చింది. తల్లి చనిపోయి ఐదు రోజులు అవుతున్నా.. మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకున్నాడు కొడుకు. గుల్రిహా ప్రాంతంలో 45 ఏళ్ల వ్యక్తి చనిపోయిన తన తల్లి మృతదేహాన్ని రోజుల తరబడి తన ఇంట్లో దాచిపెట్టాడని పోలీసులు మంగళవారం తెలిపారు. తన వద్ద డబ్బు లేకపోవడంతో తల్లి అంత్యక్రియలు నిర్వహించలేకపోయానని ఆ వ్యక్తి పోలీసులకు తెలిపాడు. అయితే ఆ వ్యక్తి మద్యానికి బానిసై మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు తెలిపారు.

మంగళవారం ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. శివపూర్-షాబజ్‌గంజ్‌లోని ఇంటికి చేరుకున్న పోలీసు బృందం మృతదేహాన్ని.. శాంతి దేవి (82) అనే మహిళగా గుర్తించారు. ఆమె రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు అని నార్త్ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మనోజ్ కుమార్ అవస్తీ తెలిపారు. ఆమె చనిపోయి ఐదు రోజులు అయినట్లు తెలుస్తోంది. మహిళ కుమారుడు నిఖిల్ మిశ్రా అలియాస్ డబ్బు మద్యానికి బానిసై మానసిక స్థితి సరిగా లేనివాడని అవస్థి తెలిపారు.

ఇంట్లో ఏం జరిగిందో సరిగా చెప్పలేకపోయాడని ఏఎస్పీ తెలిపారు. "తన తల్లి ఐదు రోజుల క్రితం చనిపోయిందని, అయితే డబ్బు లేకపోవడంతో అంత్యక్రియలు చేయలేకపోయానని కొడుకు చెప్పాడు" అని పోలీసు అధికారి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామని, నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆ మహిళకు ఒక్కడే కొడుకు ఉన్నాడని ఏఎస్పీ తెలిపారు. మిశ్రా భార్య, అతని కుమారుడు కూడా ఇంట్లో నివసిస్తున్నారు. అయితే మిశ్రా తనతో గొడవ పడుతుండడంతో ఆమె 15 రోజుల క్రితం తన కుమారుడితో కలిసి తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది.

కొంతమంది అద్దెదారులు కూడా ఇంట్లో నివసించేవారని, అయితే మిశ్రా ప్రవర్తన కారణంగా వారు కూడా నెల రోజుల క్రితం వెళ్లిపోయారని వారు తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story