పాక్ జట్టుకు మద్దతు తెలిపిన దుకాణం యజమాని.. స్థానికులు ఏం చేశారంటే..
Man forced to apologise, chant 'Bharat Mata ki jai' for backing Pak cricket team. గోవాలోని కాలంగాట్ లోని ఒక దుకాణం యజమాని పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు మద్దతు తెలిపిన
By M.S.R
గోవాలోని కాలంగాట్ లోని ఒక దుకాణం యజమాని పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు మద్దతు తెలిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఓ వర్గం అతడితో బహిరంగంగా క్షమాపణలు చెప్పించింది. అతడితో 'భారత్ మాతా కీ జై' అనే నినాదాలు చేయించారు. ట్రావెల్ వ్లాగర్ విడుదల చేసిన తేదీ లేని వీడియో నేపథ్యంలో ఇది జరిగింది. ఉత్తర గోవాలోని కాలంగాట్లోని షాప్ యజమాని పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు తాము మద్దతు ఇస్తూ ఉన్నామని. ఇదంతా ముస్లిం ఏరియా కాబట్టి మద్దతు ఇస్తున్నట్లు చెప్పడం వైరల్ వీడియోలో చూడవచ్చు.
వీడియో చిత్రీకరించే సమయంలో పాక్ న్యూజిలాండ్‌తో మ్యాచ్ ఆడినట్లు తెలుస్తోంది. వ్లాగర్ ఆ వ్యక్తితో మాట్లాడుతున్నట్లు వీడియో చూపిస్తుంది. వ్లాగర్ షాప్ యజమానిని, "ఎవరు ఆడుతున్నారు? మీరు న్యూజిలాండ్ ను ఎంకరేజ్ చేస్తూ ఉన్నారా?" అని ప్రశ్నించారు. ఆ వ్యక్తి "పాకిస్థాన్ కోసం" అని జవాబిచ్చాడు. దానికి ఆ వ్యక్తి "ఇది ముస్లిం ప్రాంతం" అని చెప్పాడు.
ఈ వీడియో వైరల్ అయిన తర్వాత, కొంతమంది వ్యక్తులు దుకాణ యజమానిని సంప్రదించి పాకిస్థాన్‌కు ఎందుకు మద్దతు ఇస్తున్నారని ప్రశ్నించారు. షాపు యజమానిని క్షమాపణలు చెప్పమని ఒత్తిడి చేసిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాలంగాట్ మొత్తం ముస్లిం లేన్ లేదా మరే ఇతర లేన్ లేదు. మతం ఆధారంగా దేశాన్ని విభజించవద్దు" అని గ్రూప్‌లోని సభ్యుడు ఆ వ్యక్తితో చెబుతున్నట్లు వీడియో చూపిస్తుంది.
అప్పుడు అతన్ని మోకరిల్లి దేశప్రజలకు క్షమాపణ చెప్పమని అడిగారు. మొదట అతడు అలా చేయడానికి ఒప్పుకోలేదు. కానీ షాప్ యజమాని మోకాళ్లపై నిలబడి చెవులు పట్టుకుని క్షమాపణలు చెప్పడం వీడియోలో కనిపిస్తుంది. 'భారత్ మాతా కీ జై' నినాదాన్ని చెప్పిన తర్వాత ఆ బృందం ఆయనను లేపుతున్నట్లు కూడా వీడియో చూపిస్తుంది. స్థానిక పోలీసు అధికారిని సంప్రదించినప్పుడు, ఈ సంఘటనకు సంబంధించి ఎటువంటి ఫిర్యాదు నమోదు కాలేదని చెప్పారు.