ఓ వ్యక్తి నదిలో స్నానం చేస్తూ భార్యను ముద్దు పెట్టుకున్నాడు. అంతే.. ఇది గమనించిన చుట్టు పక్కల వాళ్లు అతడిని బయటకు లాక్కొచ్చి తిడుతూ కొట్టారు. అతడు ముద్దు పెట్టుకుంది వేరే ఎవరినో కాదు స్వయంగా అతడు పెళ్లి చేసుకున్న అమ్మాయినే. ఈ ఘటన వేరే ఎక్కడో జరగలేదండి, మన దేశంలోనే జరిగింది. అదేంటీ..? భార్యను ముద్దు పెట్టుకోకూడదనే నిబంధన అయితే లేదుగా.. మరీ ఎందుకు అతడిని కొట్టారు అనేగా మీ డౌట్..
అసలేం జరిగిందంటే..?
ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యస్థలం, శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో ఈఘటన చోటు చేసుకుంది. అయోధ్యలో ప్రవహించే పవిత్ర సరయూ నదిలో స్నానం చేసేందుకు ఓ జంట అందులోకి దిగింది. భర్త స్నానం చేస్తూ భార్యకు ముద్దు పెట్టాడు. ఇది గమనించిన కొందరు అతడిని బయటకు లాగి తిట్టడంతో పాటు చేయి చేసుకున్నారు. ఈ ఘటన మొత్తాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. ఆ వీడియోలో అయోధ్యలో ఇలాంటి పనులు చేయడాన్ని సహించం అని ఆ గుంపులోని ఓ అనడాన్ని వినవచ్చు. విషయం పోలీసుల దృష్టికి చేరడంతో దీని దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.
अयोध्या: सरयू में स्नान के दौरान एक आदमी ने अपनी पत्नी को किस कर लिया. फिर आज के रामभक्तों ने क्या किया, देखें: pic.twitter.com/hG0Y4X3wvO