భార్యకు ఫోన్‌లో తలాఖ్ చెప్పిన భ‌ర్త‌.. పోలీసులు ఏమి చేశారంటే.?

భార్యకు ఫోన్‌లో ట్రిపుల్ తలాక్ చెప్పినందుకు ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు కేరళ పోలీసులు తెలిపారు.

By Medi Samrat  Published on  25 Jan 2025 3:50 PM IST
భార్యకు ఫోన్‌లో తలాఖ్ చెప్పిన భ‌ర్త‌.. పోలీసులు ఏమి చేశారంటే.?

భార్యకు ఫోన్‌లో ట్రిపుల్ తలాక్ చెప్పినందుకు ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు కేరళ పోలీసులు తెలిపారు. కొల్లాం జిల్లా మైనగపల్లికి చెందిన అబ్దుల్ బాసిత్‌ను అరెస్టు చేసి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు తెలిపారు. బాసిత్‌పై ముస్లిం మహిళల (వివాహంపై హక్కుల పరిరక్షణ) చట్టంలోని సంబంధిత సెక్షన్లు, BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అతడిని చవర సబ్‌ జైలులో జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించారు.

20 ఏళ్ల భార్య ఫిర్యాదు మేరకు అరెస్టు చేశారు. బాసిత్ తన మొదటి పెళ్లిని బయటకు చెప్పకుండానే ఆమెను పెళ్లి చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాసిత్ మొదటి భార్యను ఒక చోట.. రెండో భార్యను మరో చోట ఉంచాడు. బాసిత్ మొదటి పెళ్లి గురించి తెలుసుకున్న రెండో భార్య అతడిని ప్రశ్నించడం మొదలుపెట్టింది. దీంతో ఆమెను మానసికంగా, శారీరకంగా హింసించడం మొదలు పెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇద్దరి మధ్య గొడవలు పెరగడంతో ఆ మహిళ తన తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వచ్చింది. జనవరి 19న బాసిత్ ఆమెకు ఫోన్ చేసి ఫోన్ లో ట్రిపుల్ తలాఖ్ చెప్పాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

Next Story