ఫ్లైట్‌లో పక్కన కూర్చున్న మహిళను వేధించిన‌ ప్రయాణికుడు

ఢిల్లీ-చెన్నై ఇండిగో విమానంలో మహిళా ప్రయాణికురాలిపై వేధింపులకు పాల్పడిన ఉదంతం వెలుగులోకి వచ్చింది

By Medi Samrat  Published on  11 Oct 2024 5:34 PM IST
ఫ్లైట్‌లో పక్కన కూర్చున్న మహిళను వేధించిన‌ ప్రయాణికుడు

ఢిల్లీ-చెన్నై ఇండిగో విమానంలో మహిళా ప్రయాణికురాలిపై వేధింపులకు పాల్పడిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. మహిళ ఫిర్యాదుతో సదరు ప్రయాణికుడిని అరెస్టు చేశారు. దీనికి సంబంధించి విమానయాన సంస్థ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. నిందితుడు మార్బుల్‌, టైల్స్‌ అమర్చడంలో ప్రొఫెషనల్‌గా పనిచేస్తున్నాడని చెప్పారు. ఈ సంఘటన అక్టోబర్ 9 న జరిగింది. రాజేష్ శర్మ అనే ప్రయాణికుడు విమానంలో ప్రయాణిస్తూ త‌న‌ పక్కనే కూర్చున్నాడని మ‌హిళ పేర్కొంది. అత‌డు త‌న‌ను తాకేందుకు ప్రయత్నించాడని.. తాను అభ్యంతరం చెప్పిన‌ప్పటికీ త‌ను తాక‌డం కొనసాగించాడ‌ని.. తాను స్వయంగా ఆ ప్రయాణికుడిపై పైలట్‌కు ఫిర్యాదు చేయ‌గా.. విమానం గమ్యస్థానానికి చేరుకోగానే అతడిని అరెస్ట్ చేశార‌ని వెల్ల‌డించింది.

విమానాల్లో ట్యాంపరింగ్ కేసులు కొత్త కాదు. ఇటీవ‌ల వారణాసి విమానాశ్రయంలో కూడా ఇలాంటి వేధింపుల ఘటనే చోటుచేసుకుంది. ఎయిర్ హోస్టెస్‌ను వేధించినందుకు ఓ ప్రయాణికుడిని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన ఆగస్టు 30న వారణాసి నుంచి హైదరాబాద్ వెళ్తున్న విమానంలో చోటుచేసుకుంది.

Next Story