ఆలయం దగ్గర చికెన్‌, మటన్‌ వ్యర్థాలను డంప్ చేసిన వ్యక్తి.. అరెస్టు

తమిళనాడులోని కోయంబత్తూర్‌లో 41 ఏళ్ల వ్యక్తిని ఆలయ రథం సమీపంలో జంతు మాంసం వ్యర్థాలను డంప్ చేసినందుకు అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

By అంజి
Published on : 9 Jun 2024 7:47 AM IST

arrest, animal meat waste, temple, Coimbatore, Tamilnadu

ఆలయం దగ్గర చికెన్‌, మటన్‌ వ్యర్థాలను డంప్ చేసిన వ్యక్తి.. అరెస్టు 

తమిళనాడులోని కోయంబత్తూర్‌లో 41 ఏళ్ల వ్యక్తిని ఆలయ రథం సమీపంలో జంతు మాంసం వ్యర్థాలను డంప్ చేసినందుకు అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కోయంబత్తూరులోని గాంధీ పార్క్ ప్రాంతంలోని ఓ మాంసం దుకాణంలో మహ్మద్ అయాస్ అనే నిందితుడు పనిచేస్తున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూన్ 1వ తేదీ రాత్రి ఆయాలు క్యారీ బ్యాగ్‌లో చికెన్, మటన్ వ్యర్థాలను సేకరించి దుకాణం నుంచి రాజ వీధిలోని ఆలయ రథం వరకు రెండు కిలోమీటర్లు ప్రయాణించి మాంస వ్యర్థాలను పడేశాడు.

ఘటన అనంతరం పోలీసులు పారిశుధ్య కార్మికుల సహాయంతో మాంసం వ్యర్థాలను తొలగించారు. ఫిర్యాదు ఆధారంగా, వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, ప్రజలకు ఇబ్బంది కలిగించడం, రెచ్చగొట్టే ఉద్దేశ్యంతో అవమానించడం వంటి ఆరోపణలపై ఆయస్‌పై కేసు కూడా నమోదైంది. అనంతరం అతడిని అరెస్టు చేశారు. గురువారం స్థానిక కోర్టు అతడిని జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. అంతకుముందు 2022లో దీపావళి రోజున ఆలయ ప్రాంగణంలో ఐఈడీ పేలుడు సంభవించింది.

Next Story