కాంగ్రెస్ కొత్త అధ్య‌క్షుడు ఖర్గే

Mallikarjun Kharge is new party chief as Shashi Tharoor concedes defeat. పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో మల్లికార్జున్ ఖర్గే గెలుపొందడంతో 24 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌కు గాంధీయేతర

By Medi Samrat  Published on  19 Oct 2022 2:27 PM IST
కాంగ్రెస్ కొత్త అధ్య‌క్షుడు ఖర్గే

పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో మల్లికార్జున్ ఖర్గే గెలుపొందడంతో 24 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌కు గాంధీయేతర అధ్య‌క్షుడు రానున్నారు. మల్లికార్జున్ ఖర్గే ప్రత్యర్థి శశి థరూర్ ఓటమిని అంగీకరించి ఆయ‌న‌కు శుభాకాంక్షలు తెలిపారు. మొత్తం 9,385 మంది ఓట్ల‌కు గాను మల్లికార్జున్ ఖర్గే 7,897 ఓట్లు పొంద‌గా కాగా, శశి థరూర్‌కు అనుకూలంగా 1,072 ఓట్లు వచ్చాయి. 416 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. మల్లికార్జున్ ఖర్గే కొత్త పార్టీ చీఫ్‌గా ఎన్నికైన తర్వాత ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వెలుపల కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. శశి థరూర్‌పై మల్లికార్జున్ ఖర్గే గెలుపొందిన సందర్భంగా కర్ణాటక కాంగ్రెస్ నేతలు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ధోల్ ఆడారు, స్వీట్లు పంచారు.

అక్టోబర్ 17న పార్టీ అధ్య‌క్ష‌ ఎన్నికలు జ‌రిగాయి. దాదాపు 9,900 మంది ప్రతినిధులు 24 ఏళ్ల తర్వాత గాంధీయేతర అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు ఓటు వేశారు. శ‌ని థరూర్ "థింక్ టుమారో థింక్ థరూర్" అనే నినాదంతో ఎన్నిక‌ల‌కు వెళ్లారు. మల్లికార్జున్ ఖర్గే #కార్యకర్త ఖర్గే నినాదంతో ప్ర‌చారం నిర్వ‌హించారు. ఎన్నికల కౌంటింగ్ ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగింది.

ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో మల్లికార్జున్ ఖర్గే ఘన విజయం సాధించడం పట్ల టీపీసీసీ అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. దేశంలో అత్యంత ప్రజాస్వామికంగా జరిగిన కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలలో మల్లికార్జున్ ఖర్గే విజయం సాధించారని, ఖర్గే నాయకత్వంలో పార్టీ మరింత బలపడుతుందని అన్నారు.



Next Story