ప్రధాని అభ్యర్థిగా ఖర్గే..!
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పేరును
By Medi Samrat Published on 19 Dec 2023 9:15 PM ISTపశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పేరును ప్రతిపక్ష ఇండియా కూటమి ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రతిపాదించారు. మొదట గెలవడం ముఖ్యమని, మిగతావన్నీ తరువాత నిర్ణయించుకోవచ్చని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఖర్గే అన్నారు. ఇండియా కూటమి నాలుగో సమావేశం దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించారు.
వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు తదితర అంశాలను ఈ సమావేశంలో చర్చించారు. కూటమి ప్రధాని అభ్యర్థిగా ఎవరు ఉండాలనే దానిపై కూడా చర్చ జరిగింది. కూటమి పీఎం అభ్యర్థిగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేరును పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపాదించారు. ఖర్గే పేరును బెనర్జీ, కేజ్రీవాల్ ప్రతిపాదించారని సమావేశం అనంతరం ఎండీఎంకే నేత వైకో తెలిపారు. 2024 లోక్‌సభ ఎన్నికల కోసం ప్రతిపక్ష కూటమి జనవరి 30న ఉమ్మడి ప్రచారాన్ని ప్రారంభించనుందని వర్గాలు తెలిపాయి. ఈ సంవత్సరం చివరిలోగా పశ్చిమ బెంగాల్‌లో సీట్లను ఖరారు చేయాలని కోరుకుంటున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ నేతలు చెప్పారు. డిసెంబర్ 22న ఎంపీల సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమి నిరసన చేపడుతుందని ఖర్గే తెలిపారు.