రాజకీయ కుట్రలకు కాంగ్రెస్ భయపడదు : ఖర్గే
Mallikarjun Kharge after Gujarat HC's dismissal of Rahul Gandhi's plea. మోదీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో రాహుల్ గాంధీకి గుజరాత్ హైకోర్టులో చుక్కెదురయ్యింది.
By Medi Samrat Published on 7 July 2023 7:30 PM ISTమోదీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో రాహుల్ గాంధీకి గుజరాత్ హైకోర్టులో చుక్కెదురయ్యింది. రాహుల్ గాంధీ రివ్యూ పిటిషన్‌ను శుక్రవారం హైకోర్టు కొట్టివేసింది. దీంతో రాహుల్ గాంధీ సుప్రీంకోర్టు తలుపులు తట్టనున్నట్టు తెలుస్తోంది. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ పిటిషన్‌ను కొట్టివేయాలన్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ తెలిపారు. హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీ ‘రాజకీయ కుట్రలకు’ భయపడడం లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బీజేపీపై మండిపడ్డారు. రెండు యుద్ధాల్లోనూ(రాజకీయ, న్యాయ) పోరాడేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నారు. రాజకీయ కుట్రతో రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని బీజేపీ రద్దు చేసిందని కాంగ్రెస్ భావిస్తోంది. రాహుల్ గాంధీని పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేసేందుకు బీజేపీ రాజకీయ కుట్రలో భాగంగా అబద్ధాలను ఉపయోగించిందని ఖర్గే అన్నారు.
“బీజేపీ పాలనలో అవినీతిపరులు మొదట పారిపోతారు.. మరోవైపు స్వచ్ఛ్ భారత్ అభియాన్’ ద్వారా అవినీతి నిందితులను వాషింగ్ మెషీన్‌లో ఉతికి ఆరేసి అధికారం చేజిక్కించుకోవాలని మోదీ జీ పార్టీ ఆరాటపడుతోందని అన్నారు. అవినీతిపై మోదీ జీ ద్వంద్వ ప్రమాణాలు దేశానికి బాగా తెలుసు అని ట్వీట్ చేశారు. ఈ రాజకీయ కుట్రకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎవరూ భయపడరు. రాజకీయంగానూ, న్యాయపరంగానూ పోరాడుతాం. సత్యమేవ జయతే అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.
గుజరాత్ హైకోర్టు వేసిన పిటిషన్‌ను కొట్టివేసిన జస్టిస్ హేమంత్ ప్రచ్చక్ ధర్మాసనం.. రాహుల్ గాంధీ ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా 10 క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారని.. ఆయన వ్యాఖ్యలకు రెండేళ్ల జైలు శిక్ష తక్కువేనని అన్నారు. కోర్టు ఆర్డర్ సరైనదేనని అన్నారు. .శిక్షపై స్టే విధించేందుకు సరైన కారణం లేదని కోర్టు పేర్కొంది.
గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ 2019లో దాఖలు చేసిన కేసులో భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్ 499, 500 (క్రిమినల్ పరువు నష్టం) కింద మార్చి 23న సూరత్‌లోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించి.. జైలు శిక్ష విధించింది. తీర్పు అనంతరం హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.