అవును మేము విడిపోయాం.. ప్రస్తుతం నేను ఒంటరిగా ఉన్నా..

మల్లికా షెరావత్ హిందీ చిత్రసీమలో ప్రముఖ నటి. 20 ఏళ్ల క్రితం నిర్మాత మహేష్ భట్ మర్డర్ సినిమాతో సంచలనం సృష్టించి రాత్రికి రాత్రే ఫేమ్ సంపాదించుకుంది.

By Kalasani Durgapraveen  Published on  25 Nov 2024 1:46 PM IST
అవును మేము విడిపోయాం.. ప్రస్తుతం నేను ఒంటరిగా ఉన్నా..

మల్లికా షెరావత్ హిందీ చిత్రసీమలో ప్రముఖ నటి. 20 ఏళ్ల క్రితం నిర్మాత మహేష్ భట్ మర్డర్ సినిమాతో సంచలనం సృష్టించి రాత్రికి రాత్రే ఫేమ్ సంపాదించుకుంది మల్లిక. నటుడు ఇమ్రాన్ హష్మీతో ఆమె బోల్డ్ సన్నివేశాలు అప్పట్లో చాలా చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల ఒక మీడియా ఇంటర్వ్యూలో ఆమె తన ప్రేమ గురించి వెల్లడించింది. ఇది ఖచ్చితంగా సినీ ప్రేమికులను షాక్ చేస్తుంది. తాను భాగ‌స్వామితో విడిపోయిన‌ట్లు ధృవీకరించింది.

మల్లికా షెరావత్ బ్రేకప్ వార్తలు ఇటీవ‌ల బాగా చ‌క్క‌ర్లు కొట్ట‌డంతో.. ఇటీవల ఈ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మల్లిక తన బ్రేకప్ గురించి చెప్పింది. అవును, నాకు బ్రేకప్ అయిన మాట వాస్తవమే. సిరిల్ ఆక్సెన్‌ఫాన్స్, నేను చాలా కాలం పాటు కలిసి ఉన్నాము.. కానీ ఇప్పుడు విడిపోయాము.. ఈ కాలంలో అర్హత ఉన్న వ్యక్తిని కనుగొనడం చాలా కష్టం.. ఈ విషయం గురించి చాలా వివరంగా మాట్లాడదలచుకోలేదు. ప్రస్తుతం నేను ఒంటరిగా ఉన్నానని పేర్కొంది.

వివాహానికి సంబంధించి మల్లికా షెరావత్ మాట్లాడుతూ.. పెళ్లికి నేను అనుకూలం కాదు.. వ్యతిరేకం కాదు అని చెప్పింది. నేను పెళ్లి గురించి పట్టించుకోను.. ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు ఏమి కోరుకుంటున్నారో తెలియ‌ద‌ని మల్లికా షెరావత్ తన బ్రేకప్‌ను ధృవీకరించింది.

మల్లికా షెరావత్ ఫ్రెంచ్ పౌరుడు సిరిల్ ఆక్సెన్‌ఫాన్స్‌తో చాలా కాలం రిలేష‌న్ లో ఉంది. తన కెరీర్ ఊపు త‌గ్గ‌గానే ఆమె సిరిల్‌తో కలిసి పారిస్‌కు మారింది. ఆక్సెన్‌ఫాన్స్‌ ఒక వ్యాపారవేత్త. అతను రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడిదారుగా ఉన్నాడు.

Next Story