ఢిల్లీలో భారీ ఆయుధ రాకెట్ గుట్టు రట్టు.. పాక్ నుంచి సరఫరా

లారెన్స్ బిష్ణోయ్, బాంబిహా, గోగి హిమాన్షు భాయ్ వంటి ప్రసిద్ధ ముఠాలతో సంబంధం ఉన్నవారికి చైనా, టర్కీలలో తయారైన ఆయుధాలను సరఫరా చేస్తున్న అంతర్జాతీయ అక్రమ ఆయుధ ముఠాను ఢిల్లీ పోలీసులు ఛేదించారు.

By -  Medi Samrat
Published on : 22 Nov 2025 8:37 PM IST

ఢిల్లీలో భారీ ఆయుధ రాకెట్ గుట్టు రట్టు.. పాక్ నుంచి సరఫరా

లారెన్స్ బిష్ణోయ్, బాంబిహా, గోగి హిమాన్షు భాయ్ వంటి ప్రసిద్ధ ముఠాలతో సంబంధం ఉన్నవారికి చైనా, టర్కీలలో తయారైన ఆయుధాలను సరఫరా చేస్తున్న అంతర్జాతీయ అక్రమ ఆయుధ ముఠాను ఢిల్లీ పోలీసులు ఛేదించారు. పాకిస్తాన్ ISIతో సంబంధం ఉన్న ఈ రాకెట్, చైనా- టర్కీలో తయారైన అత్యాధునిక ఆయుధాలను దేశ రాజధాని ప్రాంతం, దాని చుట్టుపక్కల రాష్ట్రాలలోని గ్యాంగ్‌స్టర్లకు సరఫరా చేసేది. డ్రోన్ల వాడకంతో పంజాబ్ ద్వారా భారతదేశంలోకి ప్రవేశిస్తున్నాయని తెలుస్తోంది.

ఈ కేసుకు సంబంధించి రోహిణి ప్రాంతానికి చెందిన నలుగురిని అరెస్టు చేశారు. నిందితులు పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర నివాసితులు. వారి నుండి అత్యాధునిక పిస్టళ్లు సహా పెద్ద మొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్లు ఆయుధాలు సరఫరా చేయడానికి ఢిల్లీకి వస్తున్నారని అందిన సమాచారం మేరకు పోలీసులు రోహిణి ప్రాంతంలో దాడులు నిర్వహించారు.

నలుగురు నిందితులలో ఇద్దరు- ఫిలౌర్‌కు చెందిన మన్దీప్, లూథియానాకు చెందిన దల్విందర్ - రోహిణిలోని ఒకరికి ఆయుధాలను అందించడానికి వెళుతుండగా అరెస్టు అయ్యారు. విచారణ సమయంలో, సేకరించిన సమాచారం ఆధారంగా దాడులు నిర్వహించారు. మరో రెండు ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో అరెస్టయిన మూడవ వ్యక్తి రోహన్ తోమర్, అతను యూపీలోని బాగ్‌పత్ నివాసి, నాల్గవ వ్యక్తిని అజయ్ అలియాస్ మోనుగా గుర్తించారు.

Next Story