మహిళలకు అలర్ట్.. త్వరలో ఈ పథకం క్లోజ్
మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్ ఒకటి. ఈ పథకంలో పెట్టుబడ పెట్టేందుకు మార్చి 31తో గడువు ముగియనుంది.
By అంజి
మహిళలకు అలర్ట్.. త్వరలో ఈ పథకం క్లోజ్
మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్ ఒకటి. ఈ పథకంలో పెట్టుబడ పెట్టేందుకు మార్చి 31తో గడువు ముగియనుంది. దేశంలోని పోస్టాఫీసులు, షెడ్యూల్ బ్యాంకుల్లో ఈ పథకం కింద పెట్టుబడి పెట్టొచ్చు.
దేశంలోని మహిళలు, మైనర్ బాలిక తరఫున సంరక్షుడు ఈ పథకం కింద అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. వయసుతో సంబంధం లేదు. స్వాతంత్ర్య అమృత్ మహోత్సవ్ కింద కేంద్ర ప్రభుత్వం 2023 మార్చి 31 ఈ పథకం ప్రారంభించింది. రెండేళ్ల కాలపరిమితి కోసం అమలు చేస్తున్న స్వల్పకాలిక డిపాజిట్ స్కీమ్ ఇది. మహిళలు ఆర్థికంగా బలోపేతం చేయడమే దీని లక్ష్యం.
కనీస పెట్టుబడి రూ.1000 నుంచి మొదలై ఒకే అకౌంట్‌లో గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. దీనిపై 7.5 శాతం వార్షిక వడ్డీ చెల్లిస్తున్నారు. వడ్డీని త్రైమాసిక ప్రాతిపదికన కలిపి ఖాతాలో జమ చేస్తారు. బ్యాంకుల్లో రెండేళ్ల ఎఫ్‌డీ డిపాజిట్‌లపై ఇస్తున్న వడ్డీ కంటే ఇఏది ఎక్కువ. ఓపెన్ చేసినప్పటి నుంచి రెండేళ్ల వ్యవధి తర్వాత అసలు, వడ్డీ మొత్తం చెల్లిస్తారు.
కొన్ని సందర్భాల్లో ఎలాంటి కారణం లేకుండానే ముందే తీసుకునే అవకాశం ఉంది. ఏడాది తర్వాత డిపాజిట్ మొత్తంలో 40 శాతం ఉపసంహరించుకునే ఛాన్స్ ఉంది. తీవ్రమైన అనారోగ్యం లేదా ఖాతాదారు మరణం వంటి పరిస్థితుల్లో ముందే క్లోజ్ చేయవచ్చు. డిపాజిటర్ 6 నెలల తర్వాత ఖాతా క్లోజ్ చేస్తే వడ్డీ రేటు తగ్గుతుంది.
పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, బర్త్ సర్టిఫికెట్, ఆధార్, పాన్, అడ్రస్ ప్రూఫ్. సమీపంలోని పోస్టాఫీసు లేదా బ్యాంకులో పత్రాలు నింపి సమర్పించవచ్చు. రూ.2 లక్షల గరిష్ఠ పరిమితితో రెండేళ్ల పాటు ఈ పథకంలో పొదుపు చేస్తే.. ఏడాదికి 7.5 శాతం వడ్డీ చొప్పున తొలి ఏడాది రూ.15 వేలు వడ్డీ పొందొచ్చు. రెండో సంవత్సరంలో 16,125 వడ్డీ వస్తుంది. అంటే రూ.2 లక్షలకు మొత్తంగా రూ.31,125 రాబడి వస్తుంది.