వివాదం : దుర్గా పూజలో 'మహిషాసుర' గా మహాత్మా గాంధీ

Mahatma Gandhi as Mahishasura at Hindu Mahasabha’s pandal in Kolkata sparks controversy. కోల్‌కతాలో అఖిల భారత హిందూ మహాసభ నిర్వహించిన దుర్గా పూజలో ‘మహిషాసుర’ గా

By Medi Samrat  Published on  3 Oct 2022 2:43 PM IST
వివాదం : దుర్గా పూజలో మహిషాసుర గా మహాత్మా గాంధీ

కోల్‌కతాలో అఖిల భారత హిందూ మహాసభ నిర్వహించిన దుర్గా పూజలో 'మహిషాసుర' గా మహాత్మా గాంధీని ఉంచడంతో వివాదం చెలరేగింది. హోం మంత్రిత్వ శాఖ నుండి ఒత్తిడి రావడంతో, పూజ నిర్వాహకులు ముఖాన్ని తొలగించారు. అఖిల భారతీయ హిందూ మహాసభ ఫిర్యాదు మేరకు విగ్రహం రూపురేఖలు మార్చినట్లు పీటీఐ నివేదించింది. మండ‌పంలో దుర్గామాత కాళ్ల కింద ఉన్న మ‌హిషాసురుడికి గాంధీ ముఖాన్ని పెట్టారు. ఫిర్యాదు అందుకున్న‌ కేంద్రం హోం మంత్రిత్వ శాఖ నుంచి ఆదేశాలు రావ‌డంతో పూజ నిర్వాహకులు ముఖాన్ని మార్చారు.

అఖిల భార‌త‌ హిందూ మహాసభ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రచూర్ గోస్వామి మాత్రం తాము చేసింది కరెక్ట్ అంటూ వివరించారు. కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీని ప్రమోట్ చేస్తోంది. గాంధీని అన్ని చోట్ల నుంచి తొలగించి, నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఇతర స్వాతంత్ర్య సమరయోధులను ఉంచాలనుకుంటున్నామని గోస్వామి అన్నారు. ఈ చ‌ర్య‌ను బెంగాల్ లోని అధికార తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, సీపీఐ-ఎం, కాంగ్రెస్‌తో సహా అన్ని రాజకీయ పార్టీలు ఖండించాయి. దీనిపై బెంగాల్ హిందూ మహాసభ స్పందించింది. ఈ చర్యను బెంగాల్ ప్రావిన్షియల్ హిందూ మహాసభ ఖండించింది. బెంగాల్ ప్రావిన్షియల్ హిందూ మహాసభ నాయకుడు మాట్లాడుతూ "వారు చేసిన పనిని మేము ఖండిస్తున్నాము. వారు తమను తాము హిందూ మహాసభగా చెప్పుకుంటారు. అయితే ఇది విచారకరం" అని అన్నారు. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి కునాల్‌ ఘోష్‌ మాట్లాడుతూ ఇది చాలా తప్పు అని అన్నారు.


Next Story