ముగిసిన ప్రతిష్టంభన.. సీట్ల‌ ప్ర‌క‌ట‌నే త‌రువాయి..!

ఈసారి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు చాలా ఆసక్తికరంగా మారనున్నాయి.

By Kalasani Durgapraveen  Published on  23 Oct 2024 4:28 AM GMT
ముగిసిన ప్రతిష్టంభన.. సీట్ల‌ ప్ర‌క‌ట‌నే త‌రువాయి..!

ఈసారి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు చాలా ఆసక్తికరంగా మారనున్నాయి. శివసేన, ఎన్సీపీ రెండు, రెండు వర్గాలుగా విడిపోయిన తర్వాత రాష్ట్రంలో తొలిసారిగా ఎన్నికలు జరగనున్నాయి. ఇదిలా ఉంటే, మహారాష్ట్ర ఎన్నికల సీట్ల విషయంలో మహా వికాస్ అఘాడి (ఎంవీఏ)లో చర్చ జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. ఎవరెవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనేది ఖరారైంది. ముంబైలో సీనియర్ నేతల సమావేశం తర్వాత MVA నాయకుల మధ్య ప్రతిష్టంభన ముగిసింది. కాంగ్రెస్, ఉద్ధవ్, శరద్ పవార్ పార్టీల మధ్య ఎంవీఏలో సీట్ల పంపకం ఖరారైంది. శివసేన (యుబిటి నాయకుడు) సంజయ్ రౌత్ ప్రకారం.. సీట్ల పంపిణీని బుధవారం విలేకరుల సమావేశంలో ప్రకటిస్తారు.

టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ 105, శివసేన(UBT) 95, NCP (శరద్ పవార్ వర్గం) 84 స్థానాల్లో పోటీ చేస్తాయని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఒకరు తెలిపారు. మిగిలిన సీట్లను కూటమిలోని ఇతర చిన్న పార్టీలకు ఇవ్వనున్నారు.

సీట్ల పంపకం విషయంలో కాంగ్రెస్‌, ఉద్ధవ్‌ వర్గం మధ్య వాగ్వాదం కూడా జరిగింది. ఈ అంశంపై మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే, శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ మధ్య మాటల యుద్ధం జరిగింది. అయితే ఆ తరువాత కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బాలాసాహెబ్ థోరట్, ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్.. శివసేన (యుబిటి) చీఫ్ ఉద్ధవ్ థాకరేతో సమావేశమై సమస్యను పరిష్కరించారు.


Next Story