పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు త‌గ్గించిన మ‌హారాష్ట్ర‌

Maharashtra cuts price of petrol diesel. పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై కొత్తగా ఏర్పాటైన మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌పూ రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గిస్తున్నట్లు

By అంజి  Published on  14 July 2022 3:14 PM IST
పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు త‌గ్గించిన మ‌హారాష్ట్ర‌

పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై కొత్తగా ఏర్పాటైన మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌పూ రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గిస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే తెలిపారు. సీఎం షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాలను సీఎం వెల్లడించారు. కొత్త రేట్లు రేప‌టి నుంచి అమ‌లుకానున్నాయి. దీంతో ముంబైలో లీట‌రు పెట్రోల్ రూ.106కు ల‌భించ‌నున్న‌ది. ఇంధ‌నంపై వ్యాట్‌ను త‌గ్గిస్తున్నామ‌ని సీఎం ఏక్‌నాథ్ తెలిపారు. దీని వ‌ల్ల రాష్ట్ర బ‌డ్జెట్‌పై 6000 కోట్ల భారం ప‌డ‌నున్న‌ట్లు చెప్పారు. కానీ దీని ద్వారా ద్ర‌వ్యోల్బ‌ణాన్ని నియంత్రించ‌వ‌చ్చు అని సీఎం అభిప్రాయ‌ప‌డ్డారు.

సీఎం షిండే మాట్లాడుతూ.. ''కేంద్ర ప్రభుత్వం గతేడాది నవంబర్ 4, ఈ ఏడాది మే 22 న వ్యాట్‌ను తగ్గించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అన్ని రాష్ట్రాలు వ్యాట్‌లను తగ్గించాలని కోరారు. అయితే, గత మహావికాస్ అఘాడి ప్రభుత్వం కేంద్రం చేసిన అభ్యర్థనను పట్టించుకోలేదు. ఆర్థిక పరిస్థితిని అధ్యయనం చేసి పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ని తగ్గించాలని నిర్ణయించాం. ఫలితంగా లీటరు పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గనున్నాయి.'' అని తెలిపారు. అలాగే 1975 ఎమ‌ర్జెన్సీ స‌మ‌యంలో జైలుకు వెళ్లిన వారికి మ‌హారాష్ట్ర స‌ర్కార్ పెన్ష‌న్ ఇవ్వ‌నున్న‌ట్లు డిప్యూటీ సీఎం ఫ‌డ్న‌వీస్ తెలిపారు. ఈ నిర్ణ‌యాన్ని 2018లోనే తీసుకున్నామ‌ని, కానీ గ‌త ప్ర‌భుత్వం దీన్ని అమ‌లు చేయ‌లేద‌న్నారు.

Next Story