క‌రోనాతో మ‌రో ఎమ్మెల్యే క‌న్నుమూత

Maharashtra Congress MLA Raosaheb Antapurkar dies due to post-COVID complications. దేశంలో క‌రోనా రోజురోజుకు విజృంభిస్తోంది.

By Medi Samrat  Published on  10 April 2021 11:56 AM GMT
క‌రోనాతో మ‌రో ఎమ్మెల్యే క‌న్నుమూత

దేశంలో క‌రోనా రోజురోజుకు విజృంభిస్తోంది. కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే.. ఈ మహమ్మారి బారినప‌డి ఇప్ప‌టికే ఎంతోమంది ప్ర‌ముఖులు ప్రాణాలు వ‌ద‌ల‌గా.. తాజాగా ఓ ఎమ్మెల్యే మరణించారు. మహారాష్ట్రలోని డేగ్లూరు నియోజ‌క‌వ‌ర్గ‌ ఎమ్మెల్యే రావు సాహెబ్ అంత‌పుర్కర్ (64) శుక్రవారం రాత్రి మరణించారు.

మార్చి 19న ఆయ‌న‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో ముంబైలోని ఓ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే.. ఆయ‌న ప‌రిస్థితి విష‌మించడంతో వైద్యులు రావుసాహెబ్‌ను వెంటిలేట‌ర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో శుక్రవారం అర్థరాత్రి తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు, కుటుంబసభ్యులు తెలిపారు. మార్చి 28న ఆయ‌న‌కు క‌రోనా నెగిటివ్ నిర్ధార‌ణ అయింది. మ‌ర‌లా ఆరోగ్యం విష‌మించ‌డంతో మ‌రోమారు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతున్న క్ర‌మంలోనే ఆయ‌న తుదిశ్వాస విడిచారు. ఇదిలావుంటే.. డేగ్లూరు నియోజకవర్గం నుంచి అంత‌పుర్కర్ రెండు సార్లు గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీలో ఆయ‌న కీల‌క‌నేత‌గా ఎదిగారు. ఆయ‌న మృతిప‌ట్ల ప‌లువురు ప్ర‌‌ముఖులు విచారం వ్య‌క్తం చేశారు.


Next Story
Share it