నేను రాజీనామా చేయట్లేదు

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) ఓడిపోవడంతో పార్టీ చీఫ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు వచ్చిన వార్తలను మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే సోమవారం నాడు ఖండించారు.

By Medi Samrat  Published on  25 Nov 2024 6:30 PM IST
నేను రాజీనామా చేయట్లేదు

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) ఓడిపోవడంతో పార్టీ చీఫ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు వచ్చిన వార్తలను మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే సోమవారం నాడు ఖండించారు. ఎంవీఏ కూటమి ఇప్పటికీ అలాగే ఉందన్నారు. బిజెపి, ఏక్‌నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సిపితో కూడిన మహాయుతి కూటమి అసెంబ్లీ ఎన్నికల్లో 235 సీట్లు సాధించగా, కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన, శరద్ పవార్ నేతృత్వంలోని NCP కూటమికి 49 సీట్లు మాత్రమే వచ్చాయి.

మాజీ ఎంపీ అయిన పటోలే 2021లో మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు చేపట్టారు. ఆయన నాయకత్వంలో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది, పోటీ చేసిన 17 స్థానాలకు గాను 13 స్థానాలను గెలుచుకుంది. ఇక అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీట్ల విషయంలో చేసిన చర్చల్లో ఆయన కీలకంగా వ్యవహరించారు. కానీ పటోలే సీట్లను అమ్ముకున్నారని ఆరోపణలు కూడా వచ్చాయి.

కాంగ్రెస్ పోటీ చేసిన 103 స్థానాల్లో కేవలం 16 సీట్లు గెలుచుకోగా, సకోలి నుంచి పోటీ చేసిన నానా పటోలే కేవలం 208 ఓట్ల తేడాతో గెలుపొందారు. పటోలే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో సకోలి నుంచి దాదాపు 8,000 ఓట్ల తేడాతో గెలుపొందారు.

Next Story