రేపు ముఖ్యమంత్రి పేరు ప్రకటిస్తాం : ఏక్‌నాథ్ షిండే

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల త‌రువాత‌ ముఖ్యమంత్రి పేరుపై ఉత్కంఠ నెలకొంది.

By Medi Samrat  Published on  1 Dec 2024 12:04 PM GMT
రేపు ముఖ్యమంత్రి పేరు ప్రకటిస్తాం : ఏక్‌నాథ్ షిండే

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల త‌రువాత‌ ముఖ్యమంత్రి పేరుపై ఉత్కంఠ నెలకొంది. మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే విషయమై మహారాష్ట్ర నుంచి ఢిల్లీ వరకు పలు దఫాలుగా సమావేశాలు జరిగాయి. ఆదివారం, మహారాష్ట్రలోని సతారాలో తాత్కాలిక ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే మాట్లాడుతూ.. మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి పేరును రేపు ప్రకటిస్తామని చెప్పారు. నేను ఇప్పుడు బాగానే ఉన్నాను అని మహారాష్ట్ర తాత్కాలిక ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అన్నారు. బిజీ ఎన్నికల షెడ్యూల్ తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి ఇక్కడికి వచ్చానని తెలిపారు.

నేను 2.5 ఏళ్ల సీఎంగా ఉన్న సమయంలో ఎలాంటి సెలవు తీసుకోలేదు. నన్ను కలవడానికి ఇక్కడికి కూడా వస్తున్నారు. నేను కూడా అనారోగ్యానికి గురయ్యాను. మేం ఎప్పుడూ ప్రజల మాట వింటాం.. ఈ ప్రభుత్వం కూడా ప్రజల మాట వింటుందన్నారు. పార్టీ నాయకత్వానికి నేను బేషరతుగా మద్దతు ఇచ్చాను.. వారి నిర్ణయానికి నేను మద్దతిస్తానని ఏక్నాథ్ షిండే అన్నారు. గత 2.5 ఏళ్లలో మన ప్రభుత్వం చేసిన కృషి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందన్నారు. ప్రజలు మనకు చారిత్రాత్మకమైన తీర్పునిచ్చారని.. ప్రతిపక్షానికి ప్రతిపక్ష నేతను ఎన్నుకునే అవకాశం ఇవ్వకపోవడానికి ఇదే కారణం.. సీఎం అభ్యర్థిపై రేపు నిర్ణయం తీసుకోనున్నారు.

Next Story