కొలువుదీరిన మహారాష్ట్ర కేబినెట్‌

Maharashtra cabinet expansion 18 ministers sworn.మ‌హారాష్ట్రలో ఎట్ట‌కేల‌కు మంత్రివ‌ర్గం కొలువుదీరింది. సీఎం ఏక్‌నాథ్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Aug 2022 12:12 PM IST
కొలువుదీరిన మహారాష్ట్ర కేబినెట్‌

మ‌హారాష్ట్రలో ఎట్ట‌కేల‌కు మంత్రివ‌ర్గం కొలువుదీరింది. సీఎం ఏక్‌నాథ్ షిండే కేబినేట్‌లో 18 మందికి చోటు ద‌క్కింది. భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) నుంచి 9 మందికి, షిండే వ‌ర్గం నుంచి 9 మందికి మంత్రి వ‌ర్గంలో చోటుచేసుకుంది. మంగ‌ళ‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు రాజ్‌భ‌వ‌న్‌లో గ‌వ‌ర్న‌ర్ 18 మంది ఎమ్మెల్యేల‌తో మంత్రులు ప్ర‌మాణ స్వీకారం చేయించారు. ఈ ప్ర‌మాణ స్వీకర‌ణ కార్య‌క్ర‌మంలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర సింగ్‌ ఫడ్నవీస్ లు పాల్గొన్నారు.

రాధాకృష్ణ విఖే పాటిలావ్‌, సుధీర్‌ ముంగంటి వార్‌, చంద్రకాంతడ పాటిల్‌, విజయ్‌కుమార్‌ గావిట్‌, గులాబ్‌రావ్‌ పాటివ్‌, దాదాపు భూసే, సంజయ్‌ రాథోడ్‌, సురేష్‌ ఖాడే, సందీపన్‌ బుమ్రే, ఉదయ్‌ సమంత్‌, తానాజీ సావంత్‌, రవీంద్ర చవాన్‌, అబ్దుల్‌ సతార్‌, దీపక్‌ కేస్కర్‌, అతుల్‌ సేవ్‌, శుభురాజ్‌ దేశాయ్‌, మంగళ్‌ ప్రభాత్‌ లోధా లు మంత్రులుగా ప్ర‌మాణం చేశారు. అయితే.. వీరికి ఏ ఏ శాఖ‌లు కేటాయించారు అన్న‌ది ఇంకా తెలియాల్సి ఉంది.

శివసేన ఎమ్మెల్యే ఏక్‌నాథ్‌ షిండే, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌లు సీఎం, డిప్యూటీ సీఎంలుగా జూన్‌ 30న ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఇక డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు హోంశాఖ దక్కనున్నట్లు తెలుస్తోంది.

Next Story