అసోంలో భూకంపం సంభవించింది. శనివారం మధ్యాహ్నం 1.12 గంటలకు గౌహతిలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.1గా నమోదు అయినట్లు వెల్లడించింది. కమ్రుప్ కేంద్రంగా తేజ్‌పూర్‌కు 156 కిలోమీటర్ల దూరంలో, భూమికి పదికిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. గౌహతితో చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.