అసోంలో భూ ప్ర‌కంప‌న‌లు.. తీవ్ర‌త ఎంతంటే..?

అసోం రాష్ట్రంలో బుధ‌వారం తెల్ల‌వారుజామున 3.59 గంట‌ల స‌మ‌యంలో భూమి కంపించింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 March 2023 7:17 AM GMT
Earthquake, Assam

ప్ర‌తీకాత్మ‌క చిత్రం


ఈశాన్య రాష్ట్రాల్లో భూ ప్ర‌కంప‌న‌లు క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి. అసోం రాష్ట్రంలో భూమి కంపించింది. కమ్రూప్ జిల్లాలో బుధ‌వారం తెల్ల‌వారుజామున 3.59 గంట‌ల స‌మ‌యంలో భూమి కంపించింది. రిక్ట‌ర్ స్కేల్‌పై దీని తీవ్ర‌త 3.2గా న‌మోదు అయిన‌ట్లు నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ సిస్మోల‌జీ(ఎన్‌సీఎస్‌) తెలిపింది. భూమికి 10 కిలోమీట‌ర్ల లోతులో భూ ప్ర‌కంపన‌లు చోటు చేసుకున్నాయని తెలిపింది.

భూమి కంపించ‌డంతో గాఢ నిద్ర‌లో ఉన్న కొంద‌రు ప్ర‌జ‌లు ఉలిక్కిప‌డ్డారు. భ‌యంతో ఇళ్ల నుంచి ప‌రుగులు తీశారు. అయితే.. ఈ భూకంపం కారణంగా ఆస్తి, ప్రాణనష్టం జరిగినట్లు ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి స‌మాచారం అంద‌లేద‌ని అధికారులు తెలిపారు.

గత నెల 14న అసోంలోని నాగోస్ ప్రాంతంలో భూమి కంపించింది. 19న‌ తేదీన అరుణాచల్ ప్రదేశ్ లో భూ ప్ర‌కంప‌న‌లు చోటు చేసుకున్నాయి. ఫిబ్రవరి 28న గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లాలో రిక్టర్ స్కేల్‌పై 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. మధ్యాహ్నం 3:21 గంటలకు 10 కి.మీ లోతులో ప్రకంపనలు వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) చెప్పింది.

Next Story