ప్రధానమంత్రి నరేంద్ర మోదీని గొలుసులతో బంధించి ఉండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పక్కన కూర్చున్నట్లు చూపించే కార్టూన్‌ను పోస్ట్ చేసిన తమిళ వారపత్రిక వికటన్ వెబ్‌సైట్‌ను బ్లాక్ చేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే బ్యాన్ ఎత్తేయాలని మద్రాస్ హైకోర్టు మార్చి 6న కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
జనవరిలో ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత భారత ప్రధానమంత్రి ట్రంప్‌ను తొలిసారి సందర్శించిన వెంటనే ఫిబ్రవరి 10న వికటన్ వెబ్‌సైట్, సోషల్ మీడియా ఖాతాలలో ఈ కార్టూన్ ను ప్రచురించారు. అమెరికా అధికారులు చేతికి సంకెళ్లు వేసి అక్రమ వలసదారులను భారతదేశానికి తిరిగి పంపే అంశంపై మోదీ మౌనాన్ని ఈ కార్టూన్ సూచించినట్లు కనిపిస్తోంది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.