పెంపుడు కుక్క ఉంటే పన్ను కట్టాల్సిందే..?

Madhya Pradesh To Tax Pet Dog Owners For "Security, Cleanliness". కుక్కను పెంచుకోవాలంటే పన్ను కట్టాల్సిందే అట..! ఇది ఏ ఊర్లో తీసుకొచ్చిన నిబంధనో తెలుసా.

By M.S.R  Published on  13 Jan 2023 7:45 PM IST
పెంపుడు కుక్క ఉంటే పన్ను కట్టాల్సిందే..?

కుక్కను పెంచుకోవాలంటే పన్ను కట్టాల్సిందే అట..! ఇది ఏ ఊర్లో తీసుకొచ్చిన నిబంధనో తెలుసా..? మధ్యప్రదేశ్‌లోని సాగర్ లో..! కుక్కల యజమానులకు త్వరలోనే పన్ను విధిస్తామని తెలిపారు అధికారు. ఆ రాష్ట్రంలోనే మొదటిసారి తీసుకుని వచ్చిన నిబంధన.. నగర భద్రత, పరిశుభ్రత కోసం 40 మంది కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. సాగర్ మునిసిపల్ కార్పొరేషన్ ఇందుకు సంబంధించిన విధి విధానాలను రూపొందించిన తర్వాత, న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపి, ఈ ఏడాది ఏప్రిల్ నుండి కొత్త చట్టం అమలులోకి తీసుకుని రానున్నారు.

"కుక్కల బెడద పెరుగుతోంది, పెంపుడు కుక్కల మలమూత్ర విసర్జనతో బహిరంగ ప్రదేశాలు మురికిగా మారుతున్నాయి. సాగర్‌లోని అన్ని మునిసిపల్ వార్డులు కుక్కలకు వ్యాక్సినేషన్‌తో పాటు పెంపుడు కుక్కలను కలిగి ఉన్న వారిపై పన్ను విధించాలని ఏకగ్రీవంగా తీర్మానించాయి." అని మున్సిపాలిటీ పెద్దలు చెప్పుకొచ్చారు.

పెంపుడు కుక్కల యజమానులు అయితే ఈ పన్నును తప్పుబడుతున్నారు. కుక్కలను పెంచడానికి మేము పన్ను చెల్లించాలని కార్పొరేషన్ కోరుకుంటే, వారు మాకు కుక్కల కోసం స్థలం, పార్క్ లాంటి సదుపాయాలను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కుక్కను పెంచుకుంటున్న వ్యక్తులు.. తన ఇంట్లోని కుక్కకు టీకాలు వేయిస్తాడు. అదే మునిసిపల్ కార్పొరేషన్ విచ్చలవిడిగా రోడ్లమీద తిరుగుతున్న జంతువులను చూసుకోవాలని కోరుతున్నారు.


Next Story