డోలు వాయిస్తూ డ్యాన్స్ చేసిన ముఖ్యమంత్రి.. వీడియో వైరల్‌.!

Madhya Pradesh CM Shivraj Singh Chouhan plays dhol, dances with tribal community people. మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ డోలు వాయిస్తూ డ్యాన్స్‌ చేశాడు. జన్‌ జాతీయ గౌరవ్ దివస్‌లో పాల్గొన్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్

By అంజి  Published on  23 Nov 2021 8:53 AM GMT
డోలు వాయిస్తూ డ్యాన్స్ చేసిన ముఖ్యమంత్రి.. వీడియో వైరల్‌.!

మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ డోలు వాయిస్తూ డ్యాన్స్‌ చేశాడు. జన్‌ జాతీయ గౌరవ్ దివస్‌లో పాల్గొన్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గిరిజన సమాజానికి చెందిన వారితో కలిసి వాయిస్తూ నృత్యం చేశారు. గిరిజన నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సా ముండా జయంతి సందర్భంగా నవంబర్ 15 న ప్రారంభమైన ఈ కార్యక్రమం నిన్నటితో ముగిసింది. గిరిజనులను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు రాజు హిర్దే షా పేరిట మండల కేంద్రంలో వైద్య కళాశాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు.

స్వాతంత్య్ర పోరాటంలో గిరిజన వీరులు చాలా ముఖ్యమైన పాత్ర పోషించారని చౌహాన్ అన్నారు. మన తెగల అహంకారాన్ని అంతం చేసేందుకు బ్రిటీష్ వారు అన్ని ప్రయత్నాలు చేశారు. మేము దానిని పునరుద్ధరించబోతున్నామని సీఎం పేర్కొన్నారు. గిరిజనులు 'మహువా' (మధుకా) పువ్వుల నుండి సాంప్రదాయ పద్ధతిలో మద్యాన్ని తయారు చేసి విక్రయించడానికి వీలుగా తమ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీని రూపొందిస్తోందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా గోండు తెగ రాజులు శంక‌ర్ షా, ర‌ఘునాథ్ షాల విగ్రహాల ఏర్పాటు కోసం ముఖ్య‌మంత్రి శివరాజ్‌సింగ్ శంకుస్థాప‌న చేశారు.


Next Story